కలెక్టర్ కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' ఆశిస్తుంది ఏమిటి?
• పనులు చెయ్యకపోవడనికి కారణం ఎవరు?
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 12, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ భవనం, జిల్లా పరిపాలన కార్యాలయం లోని 'సి - సెక్షన్లో' పనులు పడకవేస్తున్నాయి. వెలుగునిచ్చే దీపం అడుగున చీకటి అనే చందంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని శాఖలు కావాలని, ఎలాంటి కారణాలు లేకుండా శాఖపరమైన పనులు చెయ్యడానికి ససేమీరా అంటున్నారు. ఈ సందర్బంగా అర్ఎన్ఐ / పిఅర్జిఐ దరఖాస్తులు కొన్ని నెలలుగా పరిష్కారానికి నోచుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. పని చెయ్యవలసిన బాధ్యతగల అధికారులు వారి బాధ్యతను వేరే అధికారుల పై నెట్టి వేస్తూ తలా తోక లేని సమాధానం చెపుతూ కాలం గడిపేస్తున్నారు. సూపరింటిండెంట్ లు మరీనా సోమరితనం మారలేదు. కలెక్టర్లు మారిన కార్యాచరణ నోచుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో పనులు పడకవేస్తున్నాయి. సంబంధిత పనులు ముందుకు సాగకపోవడానికి కారణం ధరకాస్తుదారులా ? సూపరింటిండెంట్ల ? లేక జిల్లా కలెక్టరా? సమాధానం చెప్పవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్దే? ఇకనైనా మొద్దునిద్ర వీడి పనులను ముందుకు కొనసాగిస్తారా? లేక దరఖాస్తు దారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తారా? ఈ సమస్యలకు కాలమే సమాధానం చెపుతుంది! అప్పటివరకు వేచి చూడవలసినదే.
Comment List