విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..
విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలి: రాచకొండ సిపి సుధీర్ బాబు..
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా..
విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలి: రాచకొండ సిపి సుధీర్ బాబు..
ఎల్బీనగర్, ఆగస్టు 01, న్యూస్ ఇండియా ప్రతినిధి:

విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూరు వద్ద మదర్ డెయిరీ ప్రాంతాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొని వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో కలిసి కూడళ్లు, జనం రద్దీగా ఉండే ప్రదేశాలు & రహదారులపై సంచరిస్తూ పోలీసు పెట్రోలింగ్ చేస్తూ, స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి, పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, ఆకస్మిక వాహన తనిఖీలు, మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెట్రోలింగ్ కార్యక్రమం వంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా డయల్ 100 అత్యవసర సేవలు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, లోన్ యాప్ మోసాలు, మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలు, మహిళా భద్రతా చర్యలు, చైన్ స్నాచింగ్ మరియు మొబైల్ దొంగతనాల నివారణ, సైబర్ మోసాల అవగాహన, రోడ్డు భద్రతా చర్యలు వంటి అంశాలపై ప్రజలకు సిపి అవగాహన కల్పించారు.
అనంతరం కోలన్ శివరెడ్డి నగర్‌లోని సీనియర్ సిటిజన్ బురగడ్డ అనంతాచార్యులు నివాసాన్ని సందర్శించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. సీనియర్ సిటిజన్ల పట్ల పోలీసులు చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. హయత్ నగర్ పోలీసులు చేపడుతున్న సైకిల్ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ పర్యవేక్షణ, ఆకస్మిక వాహన తనిఖీలు వంటి విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు నేరాల నిరోధకతకు, గుర్తింపుకు దోహదపడుతున్నాయని కమిషనర్ ప్రశంసించారు.
Comment List