‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!

On
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!

• కంది మండల కార్యాలయం లో 'అతి భారీ ‘భూ-కుంభకోణం' • ఫైళ్లు దొంగలించబడ్డాయా? తప్పించబడ్డాయా? • అధికారుల నిర్లక్ష్యం వైఖరి • ఇంటిదొంగల చేతివాటం! • సర్వే నం.616 భారీ ‘భూ-కుంభకోణం' • తప్పు జరగలేదు అని జవాబు చెప్పగలరా? అంటు అధికారులకు సవాల్

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 14, న్యూస్ ఇండియా : సంగారెడ్డి  జిల్లా, కంది  మండలం కార్యాలయంలో ఫైళ్లు దొంగలించబడ్డాయా? తప్పించబడ్డాయా? అనే ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వలేకపోతున్న వింత పరిస్థితి నెలకొనివుంది. తహశీల్దార్లు మారినా తప్పని ఇబ్బందులు, నాయబ్ తహశీల్దార్లు మారినా అధికారులు నడవడిక లో పరివర్తన లేదు, అదే నిర్లక్ష్యం, అదే ధోరణి! ఇది ఈ కంది మండల కార్యాలయం ప్రత్యేకమైన పనితీరు! 'సిటిజెన్ చార్టర్' లో సూచించిన విదంగా సమయపాలన పాటించకుండా పనులు చెయ్యకపోవడం ఈ కార్యాలయ అధికారుల ప్రతేక్యత అని చెప్పవచ్చు. కంది గ్రామము, సర్వే నం 616 సంబంధించి ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన 'లబ్ధిదారుల వివరాల పట్టిక' సమాచారం ఇవ్వడనికి ససేమీరా అంటున్న అధికారులు. సర్వే నం.616 లో ప్రభుత్వం ద్వారా జారీ చేసిన 'నివేశిత పట్టా సర్టిఫికెట్' సమాచార ప్రతుల పూర్తి వివరాలు బహిరంగ పరిచినట్టైతే.. ?  గతంలో జరిగిన భారీ భూ-కుంభకోణం బట్టబయలు అవుతుందని కాబట్టి,  వారి వేలితో వారి కన్ను పొడుచుకున్నట్టు అనే చందంగా పరిస్థితులు తయారవుతాయి అంటు బయపడి సమాచారం ఇవ్వడం లేదని, ఇది ఇంటిదొంగల చేతివాటం అంటు సాటి ఉద్యోగులు గుసగుసలాడుకొంటున్నారు. అంతేకాకుండా.. ఈ భారీ భూ-కుంభకోణం వేగంగా, చాకచక్యంగా చెయ్యడంలో  ఇంటిదొంగల చేతివాటం ప్రదర్శించారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి  లేదంటూ ఛలోక్తులు విసురుతుండడం ఒకింత ఆశ్చర్యానికి కల్గిస్తుంది. ప్రభుత్వ ఆస్తి అనగా ప్రజల ఆస్తి అనే కఠోరమైన నిజాన్ని విస్మరించి పనులు చేస్తున్న అధికారుల తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా అధికారులు తప్పు చేస్తూ.. వ్యవస్థను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ భారీ భూ-కుంభకోణం' తో స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. సర్వే నం.616 లో భారీ ‘భూ-కుంభకోణం జరగలేదని ద్రువీకరించి చెప్పే సాహసం 'జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డిఅర్ఓ, అర్డిఓ, యంఅర్ఓ లలో సహా ఎఒక్క అధికారైనా చెయ్యగలరా ? అంటు కంది గ్రామ ప్రజలు అధికారులకు  'సవాల్' విసురుతున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వల్లూరు క్రాంతి ఈ సమస్య పట్ల ప్రజావాణి లో అర్జీలు స్వీకరించి ఈ సమస్యను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న పి. ప్రావీణ్య ఈ సమస్యకు ఛేదించి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని ఆశాభావం వ్యక్తపరిచారు.WhatsApp Image 2025-08-14 at 4.25.28 PM

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ  జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ 
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియాబ్యూరోనరేష్):రాబోయే రెండు రోజుల్లో జిల్లాకు భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
‘భారీ భూ-కుంభకోణాన్ని' గాలికొదిలేసిన జిల్లా కలెక్టర్!
మహేశ్వరంలో ‘నషాముక్త్ భారత్ అభియాన్'..
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం
ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!
ప్రజలందరు అప్రమత్తం వుండాలి...