సల్మాన్ జన్మదినం సందర్భంగా హెల్మెట్ పంపిణీ
పంపిణీ చేసిన డిఎస్పి, సిఐలు, ట్రాఫిక్ ఎస్ఐ
కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో నరేష్): కొత్తగూడెంలోని భారత్ చికెన్ సెంటర్ నిర్వాహకులు ఎస్కే మహబూబ్ ఆలీ కుమారుడు ఎస్.కె సల్మాన్ జన్మదిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు.కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, సిఐలు కరుణాకర్, శివ ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ చేతుల మీదగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి, సిఐలు మాట్లాడుతూ.. వాహనదారులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న మహబూబ్ ఆలీ వారి పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించగా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఇతరులు ఎవరు ప్రమాద బారిన పడవద్దని మంచి ఉద్దేశంతో ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారని అన్నారు. పోలీసులు ఎవరికి శత్రువులు కాదని, వృత్తి ధర్మంగా పోలీసులు వాహన తనిఖీలలో ఫైన్ వేస్తారు తప్ప, ఎవరి పట్ల కోపంతో ఫైన్లు విధించారని అన్నారు. పోలీసులు ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడటంలో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List