గణనాథునికి 108 రకాల నైవేద్యం!
• ఇంటికొక హారతి, పలు రకాల నైవేద్యం
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 03, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, విద్యానగర్ భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి 108 రకాల 'నైవేద్యం' శ్రీ గాయత్రీ శ్రీనివాసం అపార్ట్మెంట్ వాసులు సమర్పించారు. ఇంటికొక హారతి, పలు రకాల నైవేద్యం అని ఒకరికొకరు సమన్వయము చేసుకొని మహిళలు ముందుకు వెళ్లడం ఒక ప్రతేక్య విషయమని చెప్పుకోవచ్చు. నైవేద్యం అనునది భుజించడానికి మునుపు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ, ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించడం జరుగుతుంది. ఆ పై దానిని పుణ్యఫలంగా దేవుడి ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలియచేసారు. ఈ అవకాశం వారికీ సాక్షాత్తు ఆ గణనాధుడు ఇచ్చిన భాగ్యమని గణనాథునికి జై కారాలు చేస్తూ తెలియచేసారు. వీరమల్ల గౌడ్ దంపతులు బుధవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చిన్నారులు, మహిళలు, వృద్దులతో కుటుంబసమేతంగా ఆధ్యాత్మిక, సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించి ఆటపాటలతో ఆనందంలో తేలియాడారు.
Comment List