జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
విఘ్నేశ్వర యూత్ వినాయకుని వద్ద మహ అన్న ప్రసాద వితరణ
పాల్గొన్న అన్న ప్రసాద దాత మాజీ సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్ గారు.
న్యూస్ ఇండియా తెలుగు.
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : ఘణపురం రంజిత్ కుమార్,
సెప్టెంబర్ 03,
మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం:
శ్రీ విగ్నేశ్వర యూత్ అసోసియేషన్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అన్నదాన దాత ఇమ్మడి ప్రకాష్ మాజి సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యుల సహకారంతో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఇమ్మడి ప్రకాష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం కేవలం ఆహారాన్ని అందించడం కాదు, ఇది ఒక గొప్ప పుణ్యకార్యమని,అన్న ప్రసాదం చెయ్యడం ద్వారా మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, మనకు ఒక గొప్ప సంతృప్తి లభిస్తుంది.అన్నదానం చేయడం ద్వారా, మన గత కర్మలను తొలగించవచ్చని,అదేవిదంగా అన్నదానం స్వీకరించిన వారి ఆశీర్వాదాలు మన జీవితంలో సానుకూలతను తీసుకువస్తాయి.అన్నదానం ద్వారా, ఇతరులకు ఆహారం అందించడం ద్వారా, వారికి జీవితాన్నిచ్చే అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోయూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Comment List