మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"

On
మాచన

"మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"

జనంలో ఈ స్పందననే గొప్ప పురస్కారం 
టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత 
మాచన రఘునందన్... 

రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 26, న్యూస్ ఇండియా ప్రతినిధి:

IMG-20250826-WA0530
టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత  మాచన రఘునందన్... 

స్మోకింగ్..ఎంతో మంది జీవితాల్లో అంధకారం కు కారకమౌతోంది, చేతనైనంత వరకు సమాజం లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం.. అనే సంకల్పం తో నే ముందు కు వెళ్తున్న తప్ప జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు వస్తుందని ఏ నాడు అనుకోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రోత్బలం తో చండీగఢ్ లోని సైఫర్(స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్) ప్రదానం చేసిన నేషనల్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ ను ఈ రోజు తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. తనయుల ఉన్నతి నే కన్న వాళ్లు కోరుతారని,వాళ్ళ కోసం ఐనా చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.20 ఏళ్ళ కృషి ఫలితాన్ని అవార్డు రూపం లో అమ్మ చేతులు మీదుగా..అందుకోవడం మహదానందం అని రఘునందన్ అన్నారు.
దేశ వ్యాప్తంగా 1000 వైద్య నిపుణులు పోటీ పడ్డ ఈ అవార్డు ను 100 మంది ని స్క్రూటినీ చేసి, వారిలో 20 మందిని ఎంపీక చేసి ఇచ్చారని "మాచన" చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపిక అయ్యే ఘనత మాత్రం తనకు ఒక్కరికే దక్కడం గర్వించదగ్గ విషయమని రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు.తన ఐదు పదుల జీవితం లో సొంత ఇల్లు లేకపోయినా.. జనం కోసం మంచి చేస్తున్న, అనే ఆత్మ సంతృప్తి ఉందన్నారు.

Read More 1100 గజాల పార్కు స్థలం 'కబ్జా'!

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ‘రెడ్ అలర్ట్’ భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ‘రెడ్ అలర్ట్’
• లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.. • జలాశయాలు, వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు.. •...
పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులువేద్దాం
నేరుగా ప్రజలకు ‘సాండ్ బజార్’ నుండి ఇసుక ను సరఫరా
మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"
ఆటోని ఢీ కొట్టిన టిప్పర్ 
యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలి: సీఐ శివప్రసాద్ 
సంగారెడ్డి 'బెల్టు షాపుల్లో' మద్యం అమ్మకాలు!