పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులువేద్దాం
మట్టి విగ్రహాలతో చవితి ఉత్సావాలు జరుపుకుందాం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
.కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో నరేష్):మట్టి విగ్రహాలతో వినాయకచవితి పండుగ జరుపుకోవండం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులువేద్దామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కూనంనేని మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్ర హాలతోనే పండగ జరుపుకోవాలని, కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్ర హాలను ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించడం కారణంగా పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుం దని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పలు స్వచ్చంద సంస్థల చొరవతో ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, మరింత ప్రచారం కల్పించడం ద్వారా మట్టివిగ్రహాల ఏర్పాటును విస్తృతం చేయాలన్నారు. కాలుష్యం పెరగడంతో వాతారణంలో సమతుల్యత లోపించి ఉపద్రవాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు, కాలుష్య నివారణ ప్రతిఒక్కరి బాధ్యతని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడువేల మట్టివిగ్రహాలను పంపిణి చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ పరిధిలో గణేష్ మంటపాలు వద్ద పారిశుధ్యపనులు చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంకల్పించాలను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో చోటుచేసుకోకుండా పొలిసు శాఖా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పండుగ సందర్బంగా నియోజకవర్గ ప్రజలను శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, అధికారులు అహ్మద్, వీరభద్రాచారి, రంగ ప్రసాద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఎస్ కె ఫహీమ్, గెడ్డాడు నగేష్, కేశవరావు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, దుర్గ, సతీష్ బాబు, నర్సింహా, అజీజ్, నీడల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List