*మంత్రులను కలిసన శ్రీరంగాపూర్& పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు*

*మంత్రులను కలిసన శ్రీరంగాపూర్& పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు*

By Naresh
On

*శ్రీరంగాపూర్ న్యూస్ ఇండియా*

PSX_20250823_170453 మంత్రులను కలిసన శ్రీరంగాపూర్& పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు 

*శ్రీరంగాపూర్ న్యూస్ ఇండియా*

శ్రీరంగాపూర్ మరియు పెబ్బేరు మండల సమస్యలపైన మంత్రులు మరియు ఉన్నత అధికారులను  మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపైన వినతి పత్రాలు అందచేసిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్.రాజేంద్రప్రసాద్ యాదవ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి స్థలం ఉన్నందున నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది.అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రం నుండి కొల్లాపూర్ ప్రాంతానికి, కొల్లాపూర్ కేంద్రం నుండి హైదరాబాద్ మరియు కర్నూల్ ప్రాంతాలకు శ్రీరంగాపూర్ మండల కేంద్రం గుండా బస్సు సౌకర్యం లను ఏర్పాటు చేసి, రెగ్యులర్ గా కొనసాగించాలి అని కోరడం జరిగింది.పెబ్బేరు పట్టణ కేంద్రంలో ఆర్టివో కార్యాలయం ఉంది కానీ వారానికి రెండు రోజులు మాత్రమే ఆఫీస్ పని చేస్తుంది కావునా పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని కోరడం జరిగింది.రాజేంద్రప్రసాద్ యాదవ్ పశు సంవర్ధక,మత్స్య,క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలిసి శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో పూర్తి స్థాయిలో పశు వైద్య కళాశాల నిర్మాణం కొరకై స్థలం ఉన్నందున నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలి అని కోరడం జరిగింది.
శ్రీరంగాపూర్ మండలంలో  భీమా ఎత్తిపోతుల పథకం కు సంబంధించి రిజర్వయర్ ఆధారంగా చేసుకొని అక్కడ పెద్ద ఎత్తున  మత్స్య కారులు  ఉన్నందున చేపల మార్కెట్ నిర్వహణ కొరకు మత్స్యకారుల కమ్యూనిటీ హాల్ తో పాటు,చేపల మార్కెట్ ను నిర్మించడం కొరకు 50 లక్షలు నిధులు మంజూరు చేయాలి అని కోరడం జరిగింది.దేవాదాయ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కలిసి శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ రంగనాయకస్వామి దేవస్థానం ను సందర్శించి,దేవాలయ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలి అని కోరడం జరిగింది. వారు దేవాలయం దర్శనానికి వస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది.మంత్రులు మరియు ఉన్నత అధికారులు పై సమస్యల పైన సానుకూలంగా స్పందించటం జరిగింది.ఈ కార్యక్రమం లో శ్రీరంగాపూర్ మండల అధ్యక్షులు రాములు యాదవ్,సీనియర్ నాయకులు రాంపురం సహదేవుడు,  ఆనంద్ సాగర్, కురుమయ్య, అయ్యవారిపల్లి కురుమూర్తి, ఆనంద్ ఇమ్రాన్,దీసేందర్ తదితరులు పాల్గొన్నారు.

Views: 34
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి ఎమ్మెల్యే మేఘారెడ్డి* కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి ఎమ్మెల్యే మేఘారెడ్డి*
*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*   *శ్రీరంగాపూర్:న్యూస్ ఇండియా* శ్రీ రంగాపూర్ మండల పరిధిలోని నాగసాని పల్లి గ్రామంలో గొల్లవాల గోవిందమ్మ భర్త...
*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*
భాగ్యనగర ప్రజల ఐక్యతకు, సాంప్రదాయాలకు నిదర్శనం - గణేశ్ నవరాత్రి సంబరాల వైభవం.
*మంత్రులను కలిసన శ్రీరంగాపూర్& పెబ్బేరు కాంగ్రెస్ నాయకులు*
నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించండి 
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ద్భావన దివాస్
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సద్భావన దివాస్