20 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసుల స్వాధీనం..
ఒడిషా నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరలింపు...
20 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసుల స్వాధీనం..
ఒడిషా నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తరలింపు..
ఎల్బీనగర్, ఆగస్టు 16, న్యూస్ ఇండియా ప్రతినిధి:

అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాటసింగారం వద్ద కారు ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కారులో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం ప్రాంతంలో టీఎస్26డీ1004 నెంబర్ గల కారు డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైన్నట్లు స్థానికులు పోలీస్ పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేయడం వలనే ఈ ప్రమాదం జరిగిన్నట్లు గుర్తించి... కారును పూర్తిస్థాయిలో పరిశీలించి అందులో మద్యం బాటిల్స్, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్‌స్టేషన్ తరలించారు. కారు డ్రైవర్ ది మహబూబాబాద్ జిల్లా, పుల్లూరు మండలం, బీఆర్ఎం తండా గ్రామానికి చెందిన భూక్యమధుగా గుర్తించారు. మధుకు ఖమ్మం జిల్లా, ఎన్టీఆర్ సర్కిల్‌కు చెందిన సాదిబ్ అనే స్నేహితుడు ఉన్నాడు. సాదిబ్ సూచన మేరకు గంజాయి తరలించే ఒప్పందానికి మధు ఒప్పుకున్నాడు. ఒడిషా నుంచి మహారాష్ట్ర గంజాయిను సొంతంగా తరలిస్తే వచ్చి ఎక్కువ పొందవచ్చని మధుకు ఆశచూపించి ఒప్పించాడు. గంజాయి రవాణకు మధు అంగీకరించడంతో సాదిబ్పు రూ.50వేలు ఇచ్చి.. 13 ఆగస్టు 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమండ్రి లోని గోకవరం కు వెళ్లి అక్కడ ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి మరో రూ.45000 ఇచ్చి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. మధు దారి ఖర్చుల కోసం రూ.5వేలు తన దగ్గరనే ఉంచుకున్నాడు. 14 ఆగస్టు 2025 రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లా ఖానాపురం వచ్చి 15 ఆగస్టు 2025 న హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌కు వెళ్లే క్రమంలో రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద డివైడర్ ను ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురికావడంతో కారులో గంజాయి బగోతం బయటపడింది. రాజమండ్రిలో గంజాయి అప్పజెప్పిన ఓ గుర్తు తెలియని ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా చెందిన సాదిబ్, కారు డ్రైవర్ మధు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్మెట్ ఎస్.హెచ్.ఓ వి. అశోక్ రెడ్డి తెలిపారు. గంజాయిని తరలించి నిందితుడిని కోర్డు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు.
Comment List