సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం

పోలీస్ వారికి సమాచారం అందించండి :ఎస్పీ రోహిత్ రాజు 

On
సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో నరేష్):వరుసగా సెలవులు రావడంతో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  అన్నారు.ఈ నెల 15,16,17 తారీఖులలో వరుస సెలవుల దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని,జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.అంతర్రాష్ట్ర దొంగల ముఠా మన జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసు వారికి సమాచారం అందిందని తెలిపారు.ఈ దొంగల ముఠా తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసు శాఖ తరపున రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నామన్నారు.ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేశారు.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా,ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇండ్ల పరిసర ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిదన్నారు.విలువైన వస్తువుల సమాచారాన్ని,వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదని సూచించారు.ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం అన్నారు.ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లాలి.బ్యాగుల్లో బంగారు నగలు,డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు తమ దగ్గరే పెట్టుకోవాలని సూచించారు.ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని తెలిపారు.ఇండ్లలో,కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ముఖ్యంగా మన జిల్లాలోని సింగరేణి,కేటీపీస్, నవభారత్,ఐటీసీ,బిటప్స్ మరియు ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు  కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగుల నివాస కాలనీలలో,గేటెడ్ కమ్యూనిటీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని,పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను  చేసుకోవాలని సూచించారు.అనుమానాస్పద,కొత్త వ్యక్తుల కదలికలపై జిల్లా కమాండ్ కొంట్రోల్ నంబరు 8712682128 నకు గానీ,డయల్ 100 నకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Views: 31
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో నరేష్):వరుసగా సెలవులు రావడంతో చాలా మంది దూర ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు...
రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రభుత్వ భవనాలపై’ సోలార్ ప్లాంట్లు
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం 
విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*
ఘనంగా 'సామూహిక వరలక్ష్మీ వ్రతాలు'