వెల్ డన్..రఘునందన్..
పొగాకు నియంత్రణ లో "మాచన" హీరో..
వెల్ డన్..రఘునందన్
పొగాకు నియంత్రణ లో "మాచన" హీరో
రంగారెడ్డి జిల్లా, ఆగస్టు 15, న్యూస్ ఇండియా ప్రతినిధి: -

ఇరవై ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న అరుదైన వ్యక్తి మాచన రఘునందన్ అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ (ఆర్ సి టి సి)కొనియాడింది.శుక్రవారం నాడు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దరిమిలా రఘునందన్ వర్చువల్ గా పాల్గొని "హీరో" అవార్డు ను స్వీకరించారు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వైద్య వృత్తి లో ఉన్న వారినే ఈ అవార్డు కు ఎంపిక చేయగా..రఘునందన్ మాత్రమే వైద్యేతరుడు. ఓ డిప్యూటీ తాశిల్దార్ గా ఉండి విలాస వంతమైన జీవితం గడపకుండా నిరాడంబరంగా ఆదర్శ ప్రాయంగా సమాజ హితం కోసం పాటు పడటం శ్లాఘనీయం అని ఆర్ సి టి సి ఆచార్యులు డాక్టర్ సోనూ గోయల్ కొనియాడారు.మధ్యప్రదేశ్ కు చెందిన వైద్యులు డాక్టర్ వినయ్ హజారే, రఘునందన్ కు హీరో అవార్డు రావడం కోసం రఘునందన్ చేసిన 22 ఏళ్ళ కృషి ని సవివరంగా వివరించారు.మొత్తం 15 మంది ని హీరో అవార్డు కు ఎంపిక చేయగా దక్షిణ భారత దేశం నుంచి మాచన రఘునందన్ ఒక్కరే ఉండడం గమన్హరం...
Comment List