భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,
జిల్లా (ఇన్చార్జి) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
👉 జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నెంబర్ - 7995074803
నిత్యం అందుబాటులో సిబ్బంది,
👉 అధికారులందరూ ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలి,
👉 ఎన్డిఆర్ఎఫ్,పోలీస్, రెవెన్యూ, ఆర్అండ్బి పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి,
జిల్లా (ఇన్చార్జి) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని *జిల్లా ( ఇన్చార్జి )కలెక్టర్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో* అన్నారు, బుధవారం మహబూబాబాద్- మరిపెడ రోడ్డులోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి, బైపాస్ రోడ్డును పరిశీలించి గత తేడాది పరివర్షాల వలన వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు,
మహబూబాబాద్, మరిపెడ పట్టణలలోని లోతట్టు ప్రాంతాలు, పెద్ద చెరువు, బంధం చెరువు, నిజాం చెరువు, తదితర ప్రదేశాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు, పాత భవనాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు,
ప్రమాదకరంగా ప్రవహించే, చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అందుబాటులో ఉండి అప్రమత్తం చేయాలని, మత్స్యకారులు చేపల వేటకి వెళ్లరాదని,రైతులు ,రైతు కూలీలు పొలాల వద్దకి వెళ్లకుండా చూడాలని,రాత్రి వర్షం కురిస్తే సహాయక చర్యలు చేపట్టెందుకు రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి విభాగం సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేసి భారీ వర్షాల వలన ఆస్తి ప్రాణ నష్టం పశుసంపద నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని చక చక్యంగా వ్యవహరించాలన్నారు,
జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని నిత్యం అందులో సిబ్బంది అందుబాటులో ఉంటారని భారీ వర్షాలు వరదల కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ కంట్రోల్ రూమ్ లో సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు,
అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే (బాలికల) వసతి గృహాన్ని సందర్శించారు, వర్షాకాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రుచికరమైన వేడివేడి ఆహారాన్ని వడ్డించాలని, స్టోర్ గదిని కిచెన్ డైనింగ్ హాల్ స్టడీ రూమ్స్ లను సానిటేషన్ చేయాలని, పిల్లలకు షెడ్యూలు ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, సూచించారు,
ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్లు కృష్ణవేణి, రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు విజయానంద్, రాజేశ్వర్, ఎంపిడిఓ వేణుగోపాల్, పంచాయతీ , మున్సిపల్ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Comment List