నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల

మోపాడులో దద్దాలకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు,పార్టీ శ్రేణులు

By Khasim
On
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం - ఇంచార్జి దద్దాల

అడుగడుగునా నీరాజనాలు,హారతులు, పూల వర్షంతో దద్దాలకు స్వాగతం పలికిన మహిళలు మోపాడులో "బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కార్యక్రమంలో పాల్గొన్న దద్దాల నారాయణ యాదవ్..

న్యూస్ ఇండియా పామూరు:IMG-20250801-WA1665

ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కానీ హామీలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని కనిగిరి నియోజకవర్గం వైయస్సార్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు."బాబు ష్యూరిటీ -మోసం గ్యారంటీ "కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పామూరు మండలం మోపాడు పంచాయతీలో మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు..ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఇంచార్జి దద్దాలనారాయణ యాదవ్ గడప గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రతి ఇంటికి చంద్రబాబు మోసం చేసారని ఆయన ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పేరుతో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయించడమే ద్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.ప్రజా సంక్షేమమం అనేది మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందని,గతంలో మేనిఫెస్టోను పవిత్రగ్రంథం గా భావించి ఇచ్చిన హామీలను అమలు చేసారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో పథకాలు అమలు చేశారన్నారు.ఏడాది తిరగకముందే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఇంచార్జి దద్దాల నారాయణ వివరించారు.ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి, జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీ గట్ల విజయభాస్కర్ రెడ్డి, జొన్నలగడ్డ గోవిందయ్య,షేక్ చాంద్ బాష, శ్రీరామ శ్రీనివాసులు, గయకవాడ సుహాసిని,పట్టణ మహిళా అధ్యక్షురాలు ఓరుగంటి పద్మ,లక్ష్మీ,ఆవుల భాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, సైకం ఏడుకొండలు రెడ్డి, M80 నాయబ్ రసూల్,జక్కు శ్రీనివాస్ రెడ్డి, అమ్మవరపు మోహన్ రెడ్డి, దండు రామకృష్ణ, గాజులపల్లి నారాయణరెడ్డి, కొట్ట హాజరత్, కోట సుధాకర్, బోయల శీను మహేష్, బోయల మహేంద్ర, పాలకొండు నాగేశ్వరరావు, గానుగపెంట రామకృష్ణ, గాజులపల్లి బాబు, పోలు మోహన్ రెడ్డి, కరేటి తిరుపతి, గాజులపల్లి జయరాం రెడ్డి, దండు చిన్న తిరుపతి, కల్లూరి జగన్మోహన్ రెడ్డి, దండు రఘురామిరెడ్డి, మూల కోటిరెడ్డి, కోడూరి రామసుబ్బారెడ్డి, చల్లా లక్ష్మీ నారాయణ, సీహెచ్ బాలిరెడ్డి,పెన్నా మల్లేశ్వరి, గానిగపెంట సుజాత, కల్లూరి నాగేశ్వరి, కల్లూరి జయరాంరెడ్డి, వాకమల్ల మహేశ్వర్ రెడ్డి, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, కోట దశరథరామిరెడ్డి, పేరం నాగేంద్ర, సంగు రమణారెడ్డి, గునుపాటి సుబ్బరామిరెడ్డి, ద్రోణాదుల మాలి, షేక్ నాయబ,నీరు కట్టు శ్రీనివాసులు నీరు కట్టు కొండలరావు, తుమ్మా పిచ్చిరెడ్డి,రాజశేఖర్,వైయస్, షేక్ నాగూరు బాష,చెనికల వెంగాళరావు,మితికాల వెంకట్, ఈర్ల శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక