*ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రజా యుద్దనౌక గద్దర్ కు కవులు కళాకారుల ఐక్యవేదిక ఘనంగా నివాళులు
ప్రచురుణార్దమై
*
జనగామ ఆగష్టు 06,
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92 వ జయంతి, ప్రజా యుద్ద నౌక గద్దర్ వర్దంతి జనగామ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం కవులు కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సమావేశానికి వేదిక ప్రధాన కార్యదర్శి పెట్లోజు సోమేశ్వరాచారి అధ్యక్షత వహించగా,కవులు కళాకారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై జయశంకర్ సార్ అనేక పుస్తకాలు రాశారని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేస్తూ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారన్నారు.జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి జయశంకర్ సార్ అన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కవులు కళాకారులు తీర్మానించారు.మలి దశ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద అనే గద్దర్ రాసి పాట ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసిందని అన్నారు. ప్రజా సమస్యలపై నాడు గద్దర్ కలం గళం నేటికి జనబాహుళ్యంలో నేటికి చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు రెడ్డి రత్నాకర్ రెడ్డి, వేదిక అధ్యక్షులు జి.కృష్ణ, కోశాధికారి అయిలా సోమనర్సింహాచారి, లగిశెట్టి ప్రభాకర్, పొట్టబత్తిని భాస్కర్, చిలుమోజు సాయికిరణ్,డాక్టర్ వేముల సదానందం, గడ్డం మనోజ్ కుమార్ గౌడ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, రంగరాజు ప్రసాద్,గుండె కనకయ్య, గొలుసుల నర్సయ్య,బత్తిని అశోక్, కె.నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comment List