విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*
టియుడబ్ల్యూజె ఐజెయు వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం...*
రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,జిల్లా అధ్యక్షుడు మాధవరావు,* *నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్*
*విద్య, వైద్య విషయంలో ఎల్లపుడు జిల్లా నాయకత్వం అందుబాటులో ఉంటుంది*
*టియుడబ్ల్యూజె ఐజెయు వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం...*
*రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,జిల్లా అధ్యక్షుడు మాధవరావు,*
*నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్*
*న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్*
విద్య వైద్యం విషయం లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా రాష్ట్ర నాయకత్వం ఎల్లపుడు అందుబాటులో ఉంటుందని అందులో భాగంగానే రాష్ట్ర నాయకత్వం విఐపి తరహాలో అందించే వైద్య సేవలను జర్నలిస్టులకు అందించేలా కృషి చేసిందని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,జిల్లా అధ్యక్షుడు మాధవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు విజయ్ కుమార్ లు అన్నారు.శుక్రవారం వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన వనపర్తి నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరు అయ్యి మాట్లాడారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు.జర్నలిస్టుల అభివృద్ధి కోసమే తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనే యూనియన్ పుట్టింది. నియోజకవర్గంలో జర్నలిస్టులు అందరు కలిసి మెలిసి యూనియన్ ని బలోపేతం చేయడంతో పాటు వారికి కావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు.అర్ధరాత్రి డబ్బుల కోసం వెళ్లే బ్యాచ్ వెంబడి వెళ్లకుండా ఫీల్డ్ వర్క్ చేసి నిజ నిజాలను రాయాలన్నారు. కులాలకు మతాలకు యూనియన్ పని చేయదు జర్నలిస్టుల అభివృద్ధి కోసం పని చేయడం జరుగుతుందన్నారు.వచ్చె నెల మొదటి వారంలో జర్నలిస్టులకు శ్రీరంగపూర్ రంగనాయక స్వామి ఆలయంలో శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ తరగతులను ప్రతి జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య విషయంలో గత మే నెలలోనే జిల్లా విద్యాధికారితో చర్చించి అన్ని మండలాల మండల విద్యాధికారి లకు సర్క్యులర్ పంపడం జరిగిందన్నారుమీ మండల పాఠశాలలో జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వకపోతే మండలాల విద్యాధికారులను కలిసి ఫోన్ చేయించాలని అప్పటికి వినకపోతే జిల్లా కమిటీ దృష్టికి తీసుకుని రావాలన్నారు.జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలను అందించెందుకు హెల్త్ కన్వీనర్ కూడా నియమించడం జరిగిందని అర్థరాత్రి అపరాత్రి అయినా ఆపద వస్తే హెల్త్ కన్వీనర్ ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరిగుతుందని రాష్ట్ర కార్యదర్శి మదుగౌడ్ తెలిపార.రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్,రాష్ట్ర అవుట్ సైడ్ సభ్యులు శ్రీనివాస్ రావు, వనపర్తి జిల్లా అధ్యక్షులు డి మాధవరావు,జిల్లా కార్యదర్శి రాజు, జిల్లా హెల్త్ కో కన్వీనర్ నిరుగంటి వెంకటేష్ గౌడ్,జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ గౌడ్,జిల్లా కోశాధికారి మన్యం,నియోజకవర్గం అధ్యక్షుడు విజయ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు శివసాగర్,పరశురాముడు, శ్రీరంగాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు.తదితరులు పాల్గొన్నారు
Comment List