*కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*
శ్రీరంగాపూర్ న్యూస్ ఇండియా*
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల కలలు నెరవేరుతాయి; ఎమ్మెల్యే మేఘారెడ్డి*
*శ్రీరంగాపూర్ న్యూస్ ఇండియా*
శ్రీ రంగాపూర్ మండల పరిధిలోని నాగసాని పల్లి గ్రామంలో గొల్లవాల గోవిందమ్మ భర్త కురుమయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొనడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కలలు నెరవేరాలంటే పేదరికం రాష్ట్రంలో కనబడకూడదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఆయన అన్నారు. పల్లెలలో ఒక పూరి గుడిసె కూడా లేకుండా ప్రతి ఒక్క పేద రైతుకు ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలియజేశారు. లబ్ధిదారు అయినటువంటి కురుమయ్యకు తెలుగు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారులు జీ కురుమయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ రుణం తీర్చుకోలేనిదని నా సొంతింటి కల ఎమ్మెల్యే మెగా రెడ్డి హయాంలో రావడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన తెలియజేశారు. తదనంతరం జానంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ఉమర్ ఆరోగ్యకరంగా బాధపడుతున్న విషయం మండల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకొని జానంపేట గ్రామానికి చేరుకొని ఉమర్ ని పరామర్శించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన బైక్ ప్రమాదంలో గాయపడిన ఎండీ మెయిజ్. సాయిరాం లను ఎమ్మెల్యే మేఘా రెడ్డి పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ యార్డ్ చైర్మన గౌని ప్రమోదిని పరమేశ్వర్ రెడ్డి వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నేతలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది.
Comment List