సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి

On
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 18, న్యూస్ ఇండియా : వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సర్దార్ పాపన్న గారి పోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌరవాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి జి ఐ ఐ సి చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గం శాసన సభ్యులు చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్  పి. ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.WhatsApp Image 2025-08-18 at 12.58.09 PM

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి కాళ్లు మొక్కుతాం సారు మాకు యూరియా ఇవ్వండి
మహబూబాబాద్ జిల్లా:- ఓ రైతు అధికారి కాళు మొక్కి యూరియా అడుగుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని పిఎసిఎస్ సొసైటీ వద్ద చోటుచేసుకుంది. యూరియా...
వినాయక చవితి ‘నవరాత్రి ఉత్సవాల’ కై పోలీసులకు సహకరించండి
ఘనంగా ‘ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం’
సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ 375వ జయంతి
63 అడుగుల మట్టి గణనాథుని విగ్రహాన్ని సందర్శించిన మధుయాష్కి గౌడ్..
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో "స్పా" లపై దాడులు..