భారీ వర్షాల దృష్ట్యా జిల్లాకు ‘రెడ్ అలర్ట్’
• లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.. • జలాశయాలు, వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు.. • పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదు.. • నారాయణఖేడ్ పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను సందర్శించిన జిల్లా ఎస్పీ • వర్షాల దృష్ట్యా వినాయక మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలి.. • భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 27, న్యూస్ ఇండియా : ఎడతెరిపి లేకుండా కుండపోతాల కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఈ రోజు నారాయణఖేడ్ మండల పరిదిలో గల మాద్వార్, కాంబ్లిపూర్ వాగులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద ప్రవాహం వలన ఏవైన గ్రామాలకు ప్రమాదం ఉందని, అధికారులకు అడిగి తెలుసుకున్నారు.. పొంగిపోర్లే వాగులను చూడటానికి ఎవ్వరూ రాకుండా ప్రమాద సూచిక బోర్డు లను ఏర్పాటు చేయించాలని, ప్రమాదంగా ఉన్న బ్రిడ్జ్ ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని అన్నారు. పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని అన్నారు. పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు సూచించారు. వర్షాల దృష్ట్యా వినాయక మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని, వర్షానికి క్రుంగిపోని విధంగా, మండప నిర్మాణాలు ఉండాలని, షాక్ సర్క్యూట్ కాకుండా ఎలెక్ట్రిక్ వైర్ కనెక్షన్ ఉండేలా చూడాలని, మద్యపాల వద్దకు వచ్చి, పోయే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యం ఉండాలని ఎస్పీ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, భారీ వర్షాల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సిబ్బంది 24 * 7 హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాని అన్నారు. ప్రమాద అంచున ఉన్న జలాశయాలను ఎవ్వరూ చూడటానికి, దాటడానికి ప్రయత్నించకుండా సరైన భద్రత ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఈ విజిటింగ్ లో ఎస్పీ వెంబడి నారాయణఖేడ్ డిఎస్పీ వెంకట రెడ్డి, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ విధ్యాచరన్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comment List