శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి..
బ్లడ్ గ్రూప్ ని మార్చిన శ్రీ నిత్య ఆస్పటల్...
శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి..
డిఎంహెచ్వో కు ఫిర్యాదు చేసిన బాధితులు..

ఎల్బీనగర్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆధునిక వైద్యరంగంలో అభివృద్ధితో పాటు కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతారహితంగా వ్యవహరించడం, సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైద్య సేవలు నమ్మకంతో ముడిపడే అంశమైన కొన్ని ఆసుపత్రులలో జరిగే నిర్లక్ష్యపు చర్యలు రోగుల అనారోగ్యం పైన కాకుండా ప్రాణాల పైన ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని శ్రీ నిత్య ఆసుపత్రిలో వెలుగుచూసింది. మాతృత్వం ఒక వరం అలా గర్భవతి పరీక్షల కొరకు వచ్చిన ఎన్. రమాదేవి భర్త జగదీశ్వర్ రెడ్డి నందిహిల్స్ మీర్పేట్ కి చెందిన వారు హస్తినాపురం లోని శ్రీ నిత్య హాస్పిటల్ లో మాతృత్వ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చారు. ఇందులో భాగంగా రమాదేవి రక్త పరీక్ష శాంపిల్ తీసుకొని హాస్పిటల్ కి సంబంధించిన వారు O+ గా నిర్ధారించారు. బ్లడ్ గ్రూపును సరిగా నిర్ధారించకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు జరుగుతుందని బాధితులు గ్రహించడం జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేపిస్తే B+ గా నిర్ధారించారు. ఇదే విషయం రమాదేవి తన భర్తకు పలుమార్లు చెప్పిన డాక్టర్లు చెప్పింది నిజం అని అన్నారని వారు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరెన్నో హాస్పిటల్లో ఇదే తంతు కొనసాగుతుంది. పేషెంట్లను చేర్చుకోవడం వారికి సరైన చికిత్స అందించక వారు మరణిస్తే ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం కామన్ గా మారింది. శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకొని మరొకరికి ఇలా జరగకుండా ఉండాలని బాధితులు కోరుతున్నారు.
Comment List