పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో గణనాధుల దర్శనం చేసుకున్న విగ్రహ దాత సిద్ధం కృష్ణదేవ్ గారు
ఘనంగా శాలువాతో సత్కరించిన విగ్రహ కమిటీ సభ్యులు యూత్ నాయకులు
న్యూస్ ఇండియా తెలుగు.
పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్
ఆగస్టు 31.
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో పలు వినాయక నవరాత్రి వేడుకల సందర్భంగా సిద్ధం కృష్ణదేవ్. గారు గ్రామం లో చాలా విగ్రహాలను ఇప్పించి తన ఉదారత చాటుకున్నారు.వారు ప్రతిసారీ గ్రామం లో ఇలాంటి చాలా సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. వారు శివ గణేష్ యూత్ గణనాధుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణనాధులను అన్నింటినీ దర్శించుకున్నారు. ప్రతి చోటా గ్రామ యువజన సంఘాలు, స్థానిక యువకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సిద్దం కృష్ణదేవ్ మాట్లాడుతూ..గణనాధుడు విజ్ఞానానికి, విజయానికి ప్రతీక. మన సమాజంలో ఐక్యత, అభివృద్ధి, శాంతి కోసం ఆయన కృప అందరికీ లభించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు. గ్రామంలో పూజలు పూర్తి చేసిన తరువాత,స్థానిక ప్రజలతో కాసేపు మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.గణనాధుల దర్శనాలు స్థానికంగా విశేష ఆకర్షణగా మారాయి అన్నారు. దీనికి గ్రామ యువజనులు, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు..
Comment List