టర్మినేట్ అయిన 43 మంది జేఎంఈటీ ట్రెనీల జీవితాల్లో వెలుగులు

పునర్నియామకానికి ఉత్తర్వులు జారీ చేసిన సీఎండీ బలరామ్ 

On
టర్మినేట్ అయిన 43 మంది జేఎంఈటీ ట్రెనీల జీవితాల్లో వెలుగులు

 భద్రాద్రి కొత్తగూడెం న్యూస్ ఇండియా నరేష్): సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా (జేఎంఈటీ) చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఆదేశాల మేరకు వారికి మరొక అవకాశాన్ని కల్పించేలా ఉత్తర్వులు విడుదల అయ్యాయి. గతంలో వీరంతా విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించరు. వీరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై ఇటీవల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటియూసి) కు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి వీలుగా యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇందులో భాగంగా టర్మినేట్ అయి పునర్ నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలకు ఇది తాజా నియామకంగా గుర్తించడం జరుగుతుంది. వీరంతా సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ ముందుకు వెళ్లి తమ వివరాలు, ఓవర్ మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు మొదలైనవి సమర్పించవలసి ఉంటుంది. అనంతరం ఆ కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరిన జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలు తమ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా కనీసం 190 మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వహించాలి.

మరో అవకాశం రావడం అదృష్టం.. కష్టపడి పనిచేయండి  

 ఈ ఒప్పందం ప్రకారం 24.07.2025 నాటికి టర్మినేట్ అయిన జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీల (జేఎంఈటీ) వయసు 45 సంవత్సరాల కంటే తక్కువ ఉండి , హైపర్ కమిటీలో దరఖాస్తు చేసుకొని మెడికల్ టెస్టులలో ఫిట్ అయినవారికి జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (JMET), T&S గ్రేడ్ - C గా పునర్నియామక పత్రాలను త్వరలో అందజేస్తామని సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్ తెలిపారు. తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్న వీరంతా క్రమశిక్షణతో పనిచేసి వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పోటీ మార్కెట్ లో ఉద్యోగాలను సాధించడం అతి కష్టంగా ఉంటోందని, అలాంటి సమయంలో ఒకసారి తొలగింపునకు గురైనప్పటికీ మరో విలువైన అవకాశం ఇస్తున్న కంపెనీకి ఉత్తమ సేవలు అందించాలని కోరారు.

Views: 77
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’