నేడు కనిగిరిలో జరిగే 'అన్నదాత పోరు' కు తరలిరండి - గాండ్లపర్తి
న్యూస్ ఇండియా కనిగిరి,సెప్టెంబర్08:
రైతన్నలకు అండగా నిలిచేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కనిగిరి లో రేపు (09-09-25) మంగళవారం దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన,కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే 'అన్నదాత పోరు'లో కనిగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పార్టీ నేతలు, రైతులు, కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా సహా అవసరమైన ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం కావడంతో వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా వినియోగం వలన కాన్సర్ వస్తుందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడూ రైతులకు ఎరువుల కొరత లేదన్నారు.
Comment List