సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’

On
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’

• ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ.. • అవినీతి అనకొండలకు వెన్నుదన్ను! • అడ్డగోలు పనులకు చిరునామా! • అక్రమ అడ్డుగోడలకు కొండంత అండ! • బంగారు కత్తి తో భ్రమింపచేసి 'గొంతు కోసే పనులు'! • లుచ్చా పనులు చేసే పాత్రికేయులకు తాయిలాలు ఇవ్వడంలో దిట్ట! • ప్రభుత్వ యంత్రాంగానికి పట్టిన 'చీడపురుగు'!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 09, న్యూస్ ఇండియా : సంగారెడ్డి ఆర్డీవో సి.హెచ్ రవీందర్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 'ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు' అనే చందంగా  కొనసాగిన వ్యవహారం 'హఠాత్తు గా ఈ ఆదేశాలు' అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆర్డీవోపై పలు అక్రమాల ఆరోపణలే ఈ బదిలీకి కారణమని, అవినీతి అనకొండలకు వెన్నుదన్ను గా ఉండి  పరోక్ష సహాయ సహకారాలు అందించారని అధికార వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కలెక్టర్‌ను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశించడంతో పాటు, ఆయనకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో స్పష్టం చేయడం జిల్లాలో రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది, అదే క్రమంలో బాధితుల హృదయలలో ఆశలు కూడా రేపింది. పటాన్‌చెరు పరిధిలోని 10 ఎకరాల నిషేధిత భూములను ఒక కార్పొరేటర్‌కు హక్కులు కల్పించటం, జిన్నారం మండలంలో 80 ఎకరాల స్పష్టత లేని భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అనుకూలంగా దారాదత్తం చేయడం, ముత్తంగి, రుద్రారం, కంది గ్రామాల్లో విలువైన అసైన్డ్ భూములకు అక్రమంగా హక్కులు కల్పించడం, అడ్డగోలు పనులకు తానే ఒక చిరునామా అన్నట్టుగా వ్యవహరించడం లాంటి పలు అంశాలపై పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేరినట్లు సమాచారం. అలాగే ఐలాపూర్ భూముల వ్యవహారం, రామచంద్రాపురం మండల తహసీల్దార్ పరిధిలోని వెలిమెల గ్రామంలో రెండు జిల్లాల సరిహద్దు భూముల విషయంలో నేరుగా పైరవీకారుడిగా వ్యవహరించడం, ఇదులనాగులపల్లి గ్రామా పరిధి, శివారు లో అక్రమ అడ్డుగోడలకు కొండంత అండ గా అన్నీ తానై ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలు అందించి అక్రమార్కులకు అండగా నిలబడటం తో  అతడి వ్యవహారశైలి సుస్పష్టమైందని పలువురు గ్రామస్తులు తెలిపారు. రూ. 2వేల కోట్ల విలువైన 60 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ ప్రముఖ రియల్టర్‌కు అనుకూలంగా దారాదత్తం చేయడం వంటి ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీసీఎల్ఎ అధికారులు ఇప్పటికే విచారణ జరిపి లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. పటాన్‌చెరు, రామచంద్రాపురం, కంది, అమీన్పూర్, జిన్నారం మండలాలకు చెందిన పలు కీలక భూముల ఫైళ్లు మాదాపూర్‌లోని రియల్ ఎస్టేట్ కార్యాలయానికి రహస్యంగా తరలించి, రాత్రికిరాత్రి సర్దుబాట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారు కత్తి తో భ్రమింపచేసి 'గొంతు కోసే పనుల లాగ ప్రభుత్వానికి ప్రజలకు నష్టం వాటిల్లి అక్రమార్కులకు దోచిపెట్టి పరోక్షంగా స్వంతలాభం చేసుకొనే విధంగా పనులు చేస్తుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్, ఎఫ్ ఐ అర్ నం. 180/ 2025 పోలీస్ కేసులు నిందితుడైనటువంటి పాత్రికేయుడు పి.వి రావు లాంటి లుచ్చాలకు సహాయం చెయ్యడం, సంగారెడ్డి మండలం, పసల్వాడి గ్రామం, సర్వే నంబర్ 599 లో ప్రభుత్వానికి మభ్యపెట్టి, నిజాలను దాచిపెట్టి.. 'లుచ్చా పనులు చేసే పాత్రికేయుడికి సహాయం అందిస్తూ నిరంతరం పి.వి రావు లాంటి మోసగాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడని సాటి పాత్రికేయులు అసహనంతో రగిలిపోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కంది గ్రామం, సర్వే నంబర్ 616 లో జరిగిన 'భారీ భూ కుంభకోణం' లోని నిజాలు లుచ్చా పనులు చేసే పాత్రికేయులకు తాయిలాలు ఇచ్చిన విషయాలు బయటికి రాకుండా అడ్డుపడుతూ విచారణ జరుగకుండా ప్రభుత్వానికి యంత్రాంగానికి పట్టిన 'చీడపురుగు' లాగా వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్డీవో బదిలీపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి, పటాన్చెరు డివిజన్ లలో ఇంకా ఎంత మేరా భూ కుంభకోణాలు జరిగాయో సమగ్ర దర్యాప్తు చేపడితే మరిన్ని భూ కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.RDO-5

 

Views: 607
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’