నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
యువకుడు నుండి దొంగలించిన బ్యాగు.. బ్యాగులో ఒరిజినల్ టెన్త్ ఇంటర్ మెమొలు
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి గుర్తు తెలియని వ్యక్తులు టెన్త్,ఇంటర్ సర్టిఫికెట్ల ఉన్న బ్యాగు దొంగలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన పోగుల మధు గురువారం రోజున ఉదయం 9 గంటల ప్రాంతాల్లో హైదరాబాద్ కి ఉద్యోగ రీత్యా కోసం వెళ్తున్న క్రమంలో నకిరేకల్ బస్టాండ్ లో బస్సు కోసం వేచిచూసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగు దొంగలించారు అని తెలిపారు.అందులో ముఖ్యంగా పదో తరగతి సర్టిఫికెట్లతో. పాటు ఇంటర్మీడియట్ పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. వీటితోపాటు రెండు జతల బట్టలు ఫోన్ చార్జర్ బ్యాగులో ఉందని తెలిపారు. బ్లూ కలర్ రంగు గల బ్యాగు ఎవరైనా కనిపించిన ఎడల ఈ క్రింది నెంబర్ కి 8187016284 ఫోన్ చేసి వివరాలు తెలపాలని తెలియజేశారు.
Comment List