శబ్బాష్.. మున్సిపాలిటీ

తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్

On
శబ్బాష్.. మున్సిపాలిటీ

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 11, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, పోతిరెడ్డి పల్లి పరిధి, విద్యానగర్ కాలనీ, 3వ నం విధి లో ఒక ఎద్దు బీభత్సం సృష్టించి కొంతమంది పాదచారులని గంభీరంగా గాయపరిచింది. సురేష్ అనే ప్రభుత్వ ఉద్యోగిని దారుణంగా గాయపరచడం తో స్థానికులు తక్షణమే స్పందించి అంబులెన్సు రప్పించి గాయపడ్డ ఆ బాధితుడిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకై చేర్పించారు. స్థానికులు వెంటనే సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ కు విషయం తెలియచేసారు. విషయం తెలుసుకొన్న మున్సిపల్ కమిషనర్ వెంటనే  తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందికి ఆదేశించారు. చెలరేగిపోయిన ఆ ఎద్దును కట్టడి చేసి పశువుల ఆసుపత్రికి తరలించి తగువైద్యం అందించి సురక్షితమైన గోశాలకు స్థలానికి తరలించాలని మున్సిపల్ కమీషనర్ వారి సిబ్బందికి సూచనలు జారీచేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంటామని ప్రజలు ఆందోళన చెందకుండా, జాగృతి కలిగి ఉండాలని, ఈ ఘటన తొందరగా కట్టడి చేయడానికి స్థానికులు చక్కటి సహాయ సహకారాలు అందించారని తెలియచేసారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ వారి సహాయ సహకారాలతో 'పశువుల' యజమానులకు హెచ్చరికలు జారీచేస్తామని, ఐనప్పటికీ బేఖాతరు చేస్తే? పశు యజమానులపై చట్టరీత్య చర్యలు తీసుకొంటామని మున్సిపల్ కమిషన ఘాటుగా హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కల్గించే విషయంలో ఎలాంటి రాజీపడబోమని, ప్రజా సంరక్షణ 'సర్వోపరి' అని తెలియచేసారు.Screenshot 2025-09-11 132734 

Views: 203
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...? నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
తెలంగాణ భూముల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా కాశిమల్ల విజయ్ కుమార్ నియామకం..
శబ్బాష్.. మున్సిపాలిటీ
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
జాతీయ సేవా పథక అవశ్యకత పై అవగాహన కార్యక్రమం... 
సంగారెడ్డి అర్డిఓ కార్యాలయానికి పట్టిన ‘గ్రహణం వీడింది’