సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ పై సస్పెన్షన్ వేటు..
• ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి నుండి డబ్బు డిమాండ్ చేసిన ఎస్‌ఐ రవీందర్ పై ఎస్పీ సీరియస్. • ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా పై అధికారులకు శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేసిన జిల్లా ఎస్పీ..
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, అక్టోబర్ 02, న్యూస్ ఇండియా : మల్టీ జోన్-II ఐజీపీ ఆదేశాల మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో వివరిస్తూ.. సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ కు సంభందించిన ఓ కేసులో రవీందర్ ఎస్ఐ ఒక వ్యక్తి నుండి డబ్బులను అడిగినందుకు గాను, సంబంధిత వ్యక్తి డబ్బులు ఇవ్వలేనని, మన స్థాపానికి లోనై నదిలోకి దూకి అదృశ్యమయ్యాడు. అందుకు సంబంధించి మిస్సింగ్ అయిన వ్యక్తి యొక్క భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో, ఎస్పీ సంగారెడ్డి డీఎస్పీ ద్వారా ప్రాథమిక విచారణ జరిపించి, నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు రూరల్ ఎస్ఐ పై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి, మల్టీ జోన్-II ఐజీ ఆదేశాల మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్ఐ రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఏ స్థాయి లో ఉన్న వారైన శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
Comment List