ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు

లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో

ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు

 

ఒక్కరి నేత్రదానం ఇద్దరికీ కంటిచూపు అనీ ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు శనివారం మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లాIMG_20251005_121357 తొర్రూరు పట్టణంలోనీ శ్రీ రామ ప్రింటర్స్ వేమిశెట్టి రాము తల్లి,వేమిశెట్టి భాగ్యలక్ష్మి స్వర్గస్తులైన సందర్భంగా వారి నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రామ నరసయ్య మాట్లాడుతూ...నేత్రదానం ద్వారా ఇద్దరికీ చూపుని ప్రసాదించే అవకాశం లభిస్తుందని, కార్నియల్ సమస్యలతో బాధపడుతున్న వారికి తిరిగి వెలుగుని అందించవచ్చని వివరించారు.భాగ్యలక్ష్మి కుమారుడు రాము తన తల్లి నేత్రాలను దానం చేయడానికి అంగీకరించగా లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ నేత్రాలను సేకరించి ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ కి పంపించారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ...భాగ్యలక్ష్మి దహన సంస్కార ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ను లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు తరఫున క్లబ్ అధ్యక్షుడు డా. రామ నరసయ్య భరించనున్నట్టు రాము కుటుంబానికి తెలిపారు.భాగ్యలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని లయన్స్ క్లబ్ తరఫున ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చిదురాల నవీన్, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, సభ్యులు మచ్చ సురేష్, చిదురాల శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.

Views: 75
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే