‘శభాష్’ అక్షయ, ఇంటర్ లో 977/1000 మార్కులు.

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

On
‘శభాష్’ అక్షయ, ఇంటర్ లో 977/1000 మార్కులు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 24, న్యూస్ ఇండియా : ఇటీవల విడుదలైన ఫలితాలలో 1000 మార్కులకు గాను 977 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన మంగలి అక్షయను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అభినందించారు.
పటాన్చెరువు మండలం ముత్తంగి లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి పూర్తిచేసి సంగారెడ్డిలో నిరుపేద కుటుంబానికి చెందిన మంగలి పద్మ శ్రీశైలం దంపతుల అక్షయ ఇంటర్ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్షయను కలెక్టర్ క్యాంప్  కార్యాలయంలో అభినందించి స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అక్షయకు కలెక్టర్ / డాక్టర్  కావాలని సూచించారు. ఈ సందర్భంగా అక్షయ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఫలితాలలో 977 మార్కులు రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ మార్కులు రావడానికి లెక్చరర్లు, ప్రిన్సిపల్ కృషి చేసినట్లు తెలిపారు. ఇంటి కి దూరంగా ఉన్న పట్టుదలతో చదువుకున్నట్లు తెలిపారు.  భవిష్యత్తులో డాక్టర్ కావాలని అనుకుంటున్నాట్లు ఎంబిబిఎస్ చదవడానికి ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్పకుండా విజయం సాధిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, కార్యదర్శి శ్రీశైలం యువత ప్రధాన కార్యదర్శి రాము యువత అధ్యక్షుడు ఆంజనేయులు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-24 at 6.05.40 PM

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు 27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి) జనవరి 19: కొత్తగూడెం  కార్పొరేట్ పరిధిలోని 27 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దెల సుధారాణి తన దరఖాస్తును  భద్రాద్రి కొత్తగూడెం...
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత 
రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..
ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..