మదీనాగూడ గౌతమ్ మోడల్ స్కూల్ లో  100% ఫలితాలు సాధించిన విద్యార్థులు

-అభినందించిన ఉపాధ్యాయులు

On
మదీనాగూడ గౌతమ్ మోడల్ స్కూల్ లో  100% ఫలితాలు సాధించిన విద్యార్థులు

శేరిలింగంపల్లి ( ఏప్రిల్ 30) : న్యూస్ ఇండియా ప్రతినిధి కే.వినోద్ కుమార్

IMG-20250430-WA0044కళలభారతి రవీంద్రభారతిలో ది.30-04-2025 బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి  చేతులమీదుగా విడుదల చేసిన పదవతరగతి ఫలితాలలో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల్ మదీనాగూడ విలేజ్ గౌతమ్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్ధులు వందశాతం ఫలితాలు సాధించారు.అందులో విద్యార్థి ఎస్. భరద్వాజ్ 588/600 మార్కులు సాధించి టాపర్ గా నిలిచాడు మరియు విద్యార్థులు ఉత్తమ మార్కులతో విజయ దుందుభి మోగించారు.విద్యార్ధులు వారి తల్లితండ్రులు సంతోషం వెలిబుచ్చారు .ఈ  సందర్బముగా గౌతమ్ మోడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీకాంత్, మాట్లాడుతూ ఫలితాలు సాధించటంలో ప్రధానోపాద్యాయురాలు  ప్రిన్సిపల్ సంధ్యారాణి, కృషి, ఉపాధ్యాయుల నిరంతర శ్రమ విద్యా బోధన మరువలేనిదని ,నిరంతరం విద్యార్థులు చదువుటకు ఎప్పటికప్పుడు సరికొత్త విధానంతో ఉపాద్యాయ బృందంతో కలిసి విద్యబోధించటంతోనే ఈ ఫలితాలు సాధించారని ,మెరిసిన పది ఫలితాలు చూసి గౌతమ్ మోడల్ స్కూల్ మురిసిపోతుందని ఆనందపడుతూ,విద్యార్ధులకు, ప్రధానోపాద్యాయురాలు సంధ్యారాణి మరియు ఉపాధ్యాయబృందానికి , తల్లితండ్రులకు విద్యావృద్దికి సహకరిస్తున్న  వారికి డీన్ భరద్వాజ్ హృదయ పూర్వక అభినందనలు తెలియచేసారు.

Views: 362
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News