'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!

సంగారెడ్డి మున్సిపాలిటీ నిర్వాకం

On
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 18, న్యూస్ ఇండియా : తప్పుడు పత్రాలకు ఆధారం చేసుకొని ఇండ్ల నిర్మాణాలు లేకున్నా ఇంటి నెంబర్ ల అనుమతులు జారీ చేస్తూ, 'ఇంటి నెంబర్' లు అమ్ముకొంటున్నారని గత కొన్ని వరాల నుండి సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం పై విమర్శలు కొనసాగుతూనే వున్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రోత్స హిస్తున్న రెవిన్యూ, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎం. శ్రీధర్ సి డి ఎం ఏ కి ఫిర్యాదు చేసారు. సంగారెడ్డి పట్టణం లో తప్పుడు పత్రాలు సృష్టించి మోస పూరీతంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఇండ్లు లేకున్నా ఇంటి నెంబర్ లు పొందుతున్నారని, ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇస్తున్న సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం రెవిన్యూ మరియు, టౌన్ ప్లానింగ్  అధికారుల కీలకమైన పాత్ర పోషిస్తున్నారని సర్వత్రా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సంగారెడ్డి పట్టణం లోని సర్వే నెంబర్ 374 లో తప్పుడు పత్రాలతో మున్సిపల్ కార్యాలయం నుండి ఇండ్లు లేకున్నా ఉన్నట్లు ఇంటి నెంబర్ లు, వాటిపై అనుమతులు పొంది ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణం చేస్తున్నారని మున్సిపల్ రెవిన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇండ్ల అనుమతి పత్రాల పై కనీస క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా అనుమతులు ఇస్తున్నారని పిర్యాదు దారుడు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ రెవిన్యూ టౌన్ ప్లానింగ్ అధికారుల విధుల నిర్లక్ష్యం కారణంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణకు గురి అవుతున్నాయనే  విషయం సంగారెడ్డి పట్టణ ప్రజలకు విదితమే. సంగారెడ్డి మున్సిపల్ అధికారులు సర్వే నెంబర్ 374 లో తప్పుడు పత్రాలకు ఇంటి నెంబర్లు జారీ చేసిన విషయం పట్ల విచారణ చేసి  ప్రభుత్వ భూముల  ఆక్రమణ కు పాల్పడ్డ వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఎం. శ్రీధర్ తెలంగాణ మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్( సి డి ఎం ఏ ) హైదరాబాద్ కార్యాలయం లో ఫిర్యాదు చేసారు. WhatsApp Image 2025-06-18 at 5.51.29 PM

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!