పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...

- యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు మన అధీనంలో ఉంటాయి... యోగా ఆసనాలు మనుషుల వ్యాధులకు నివారణ...

On
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...

- కార్యక్రమంలో యోగా ఆసనాలతో నరవ దంపతులు ప్రదర్శన...

న్యూస్ ఇండియా ప్రతినిధి / పెద్దకడుబూరు మండలం జూన్ 21 :- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలరోజుల పాటు యోగాంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా శనివారం పెద్దకడుబూరు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్పెషల్ అధికారి పర్యవేక్షణలో మరియు మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు, గ్రామ ప్రజలందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి మరియు టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రామాకాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి నరవ శశిరేఖ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవనం కోసం ప్రజలందరూ కూడా యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరం మనస్సు మన అధీనం లో ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వం యోగా ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ, ఎంపీడిఓ, ఎంఈఓ మరియు ఇతర అధికారులు ప్రజలు, విద్యార్థులు, కూటమి పార్టీ కార్యకర్తలు, వీరామహిళలు పాల్గొన్నారు...20250621_211505

Views: 75
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!