అంతర్జాతీయ యోగా దినోత్సవం.

On
అంతర్జాతీయ యోగా దినోత్సవం.

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం మేర యువ భారత్, అధ్వర్యంలో జాగృతి యూత్ అసోసియేషన్ మరియు హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వారు ఖమ్మం, రఘునాధపాలెం మండలం తెలంగాణ బీసీ వెల్ఫేర్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా యోగ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరువు మాదారం మరియు దానివాయిగూడెం బీసీ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్స్ గ్రేట్ వన్ డి.శ్రావణి, జి.నాగమణి, వారు మాట్లాడుతూ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని సరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదన చేశారనీ, ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారనీ, యోగా అనేది మానవులకు మంచే కలుగజేస్తుందని, యోగ ప్రతిరోజు చేయడం వలన జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని సకల రోగాలకు బెడ్ పెడుతుందని అన్నారు. అనంతరం హ్యూమన్ రైట్స్ ఎస్.గణేష్ మాట్లాడుతూ మానవ హక్కులను ఉల్లంఘన చెస్తే ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షించవచ్చని అన్నారు. మా సంస్థ ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. మీ పెద్దలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యపై అవగాహన కల్పించి వారి హక్కును వినియోగించుకునే విధంగా సంబంధిత అధికారికి సమన్వయపరిచి న్యాయం జరిగే వరకూ మీ తరపున పోరాడుతామని అన్నారు. పిల్లలు చిన్నతనం నుంచే మంచి మార్పులు సంపాదించుకుంటూ మంచి అలవాట్లకు నేర్చుకుంటు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారికి మంచి చేసే గుణం కలిగి వుండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు యోగ హాసనలు ప్రదర్శన చేశారు. మరియు కొంతమంది విద్యార్థులు స్పీచ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. స్పీచ్ కాంపిటీషన్ మరియు యోగాసనాలలో విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్స్ ఆఫీసర్ కే.భానుచందర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!