రూ.9 కోట్ల విలువ ప్రభుత్వ ఆస్థి 'స్వాహా'.
అక్రమరుకులకు సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. పట్టించుకోని కలెక్టర్ (లోకల్ బాడీస్). ఈ అక్రమ నిర్మాణాలలో అధికారులకు పరోక్షంగా వాటాలు!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 09, న్యూస్ ఇండియా : ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కి రెండోసారి ఫిర్యాదు ఇచ్చారు. సంగారెడ్డి పట్టణం లోని సర్వే నెంబర్ 374 లోని ప్రభుత్వ భూమిలో ఐదు గురు ప్రైవేట్ వ్యక్తులు అక్రమాలకు తెరలేపారు. అధికారులకు ప్రభావితం చేసి, తప్పుడు సమాచారం సమర్పించి, ఇండ్లు లేకున్నా ఇండ్లు ఉన్నట్టు గా మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్ లు పొందారు. జి. ఓ 59 కింద క్రమబద్ధికరణకు దరఖాస్థులు చేసి, సర్వే నెంబర్ 374 భూమి ని కల్వకుంట సర్వే నెంబర్ లో ఇండ్లు ఉన్నట్టు సంగారెడ్డి మున్సిపల్ అధికారులకు తప్పుడు సమాచారము ఇచ్చి అనుమతులు పొందారు. ఆ విధంగా అక్రమ నిర్మాణాలు చేస్తు, సంగారెడ్డి తహసీల్దార్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ లంచాలతో ప్రభావితం చేసి ఆక్రమణ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. కోర్టు పేరుతో రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మున్సిపల్, రెవిన్యూ అధికారులకు ప్రాలోభలకు గురి చేసి నిర్మాణాలు చేస్తున్నారు. అట్టి అక్రమ నిర్మాణాల పై, భూ అక్రమణ చట్టం, మున్సిపాల్టీల చట్టం 2019, భూ భారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోని బాధ్యులై న మున్సిపల్, రెవిన్యూ అధికారుల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు ఎం.శ్రీధర్, డి. త్రివిక్రమ్ రావు, కసిని వాసు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి. చంద్ర శేఖర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ అక్రమ నిర్మాణాలలో అధికారులకు పరోక్షంగా వాటాలు ఉన్నాయని, అందుకే ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగంగా విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Comment List