అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) నిర్లక్ష్యం'.

అక్రమ నిర్మాణాలపై 'అధికారుల నిర్లక్ష్యం'.

On
అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) నిర్లక్ష్యం'.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, సర్వే నెంబర్ 374 లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోని, అక్రమంగా జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని సామాజిక కార్యకర్త ఎం. శ్రీధర్సి సి ఎల్ ఏ కి ఫిర్యాదు  చేసారు. సంగారెడ్డి పట్టణం లోని ఎంపీడీఓ కార్యాలయానికి ఎదురుగ, బైపాస్ మార్గంలో  సర్వే నెంబర్ 374’ ప్రభుత్వ భూమిలో మోసపురితంగా, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి,  ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఇండ్లు లేకున్నా ఇంటి నెంబర్ లను  పొందిన ఐదు గురు ప్రైవేట్ వ్యక్తులు దాదాపు 900 గజాలు ప్రభుత్వ భూమిని  అధికారులకు ప్రభావితం చేసి అడ్డదారిలో కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు.  జి. ఓ 59 కింద క్రమబద్ది కరణకు దరఖాస్తు, అట్టి స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఇంటి నెంబర్ లు పొందారు. అంతేకాకుండా అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) కు ఈ విషయం పట్ల పై పిర్యాదు చేశామని దానికి బదులుగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) మౌఖికంగా అభయం ఇచ్చాడని, కానీ ఆ పిర్యాదు కు సంబందిచిన రసీదు ఇవ్వలేదని సామజిక కార్యకర్త శ్రీధర్ బాధను వెలిబుచ్చాడు. తహసీల్దార్ సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి లకు ఫిర్యాదు చేసిన విచారణ చేయకుండా ప్రభుత్వ భూమి లో ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రాజకీయ పలుకు బడితో అధికారుల పై ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణం చేస్తున్నారని తెలిపాడు. గతంలో తహిశీల్ధార్ గా పనిచేస్తున్న దేవదాస్ కు అక్రమ కట్టడం సంబదించిన ఫొటోగ్రాఫ్స్ తీసి తక్షణమే పనులను నిలిపివేయాలనే మౌఖిక ఆదేశాలు గాలికివదిలేశారని పిర్యాదు దారుడు అసహనం వెలిబుచ్చాడు. ఈ ప్రభుత్వ భూమి లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారి పై విచారణ చేసి నిబంధనలకు విరుద్ధంగా జి. ఓ 59 కింద చేసిన దరఖాస్తుల పై భూ భారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎం. శ్రీధర్ హైదరాబాద్ లోని తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం లో ఫిర్యాదు చేసాడుSridhar.

Views: 41
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం