అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...

అక్రమ రిసార్ట్ నిర్మాణాల ఫిర్యాదుపై డిఎల్పిఓ తనిఖీలు..

On
అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...

అక్రమ రిసార్ట్ నిర్మాణాల ఫిర్యాదుపై డిఎల్పిఓ తనిఖీలు..

IMG-20250530-WA1133(1)
అక్రమ రిసార్ట్ నిర్మాణాల ఫిర్యాదుపై డిఎల్పిఓ సాధన తనిఖీలు..

ఇంటి నెంబర్ తో ఆరుట్లలో అక్రమంగా రిసార్ట్ నిర్మాణాలు..

అధికారుల నిర్లక్ష్యమే కారణం...

అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి...

Read More ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.

రంగారెడ్డి జిల్లా, మే 30, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇంటి నెంబర్ తో అక్రమంగా రిసార్ట్ నిర్మాణాలు చేపట్టి, వాటిని అనేక రకాల ఫంక్షన్లకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనికి కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. 

Read More 'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!

హెచ్ఎండిఏ అనుమతులు..

Read More ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!

హెచ్ఎండిఏ లో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, హెచ్ఎండిఏ లో అనుమతులు తీసుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి ఉంటుందని, గ్రామస్థాయి, మండల స్థాయి, అధికారులతో కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అక్రమాలకు అధికారుల అండదండలు అందిస్తుండడంతో అక్రమ నిర్మాణాలు ఏదేచ్ఛగా కొనసాగుతున్నాయి.

జిల్లా స్థాయి అధికారుల నిఘా…

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో, కొందరు అక్రమార్కులు గోరంత అనుమతులు తీసుకొని కొండంత నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి రిసార్ట్ ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని, వాటిపై జిల్లా స్థాయి అధికారులు, అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టాలని, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఆరుట్ల గ్రామంలో అక్రమ రిసార్ట్ నిర్మాణం…

రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని "తెలంగాణ అరకు రిసార్ట్" నిర్మాణ అనుమతుల విషయంలో ఆరుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పై వచ్చిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ సాధన శుక్రవారం రిసార్టును సందర్శించారు. నిర్మాణ అనుమతుల విషయంలో విచారణ చేపట్టి, జిల్లా పంచాయతీ అధికారికి తెలుపుతామన్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News