రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

రక్తదానం చేయండి..! ప్రాణాలను కాపాడండి..!!

On
రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

IMG-20250611-WA1110
రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న కాశమల్ల విజయ్...

నల్గొండ జిల్లా, జూన్‌ 12, న్యూస్ ఇండియా ప్రతినిధి: రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అని కాశమల్ల విజయ్ వెల్లడించారు. మూడు సంవత్సరాల కాలంలో.. 10 సార్లు రక్తదానం చేసి… ఎందరో ప్రాణాలు నిలిపాడు నల్గొండ జిల్లా నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కాశమల్ల విజయ్. ఎ పాజిటివ్ బ్లడ్‌ కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ.. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ.. తన వంతు సమాజ సేవ చేస్తున్నాడు. అదే విధంగా ప్రత్యేక రోజుల్లోనూ రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రక్తాన్ని అందించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నాడు. తనలాగే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చేవారు 8688662474 కు నంబర్‌ ద్వారా సంప్రదించాలని సూచిస్తున్నాడు.

Views: 47

About The Author

Post Comment

Comment List

Latest News