తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి

తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి

మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు పట్టణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని అభ్యాస్ స్కూల్లో చదువుతున్న నల్లగొండ జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాల గ్రామం మర్రికుంట తండా కు చెందిన బానోత్ వెంకన్న కుమారుడు బానోతు వెంకట చైతన్య అనే విద్యార్థి గత మూడు సంవత్సరాలుగా తొర్రూరు పట్టణం ఇదే స్కూల్లో చదువుకుంటున్నాడు. గత ఆదివారం రోజు రాత్రి ఎలుకల మందు తాగి విద్యార్థి స్పృహ కోల్పోగా స్కూల్ యాజమాన్యం హుటాహుటిన పట్టణ కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు కానీ విద్యార్థి కి సీరియస్ గా ఉందని  యజమాన్యం తెలుపి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకుపొమ్మని చెప్పగా, స్కూల్ యాజమాన్యం మాత్రం తల్లిదండ్రులకు మీ అబ్బాయికి ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపి రమ్మని హైదరాబాద్ తీసుకుపోయే క్రమంలో సోమవారం రోజు రాత్రి విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మరణంతో తల్లిదండ్రులు బంధువులు బోరున విలపించి స్కూలు ఆవరణలో విద్యార్థి మృతదేహాన్ని ఉంచి మా కుమారుడు మృతి చెందడానికి స్కూల్ యాజమాన్యమే కారణమని తెలిపారు మా కుమారుని మృతి పట్ల మాకు అనుమానం ఉందని మాకు తగిన న్యాయం చేయాలని విద్యార్థి మృతదేహంతో ధర్నా నిర్వహించారు సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 205
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక