పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!
వైసిపి జిల్లా ఉపాధ్యక్షులను కలిసి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బొగ్గుల ఆర్లప్ప
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
న్యూస్ ఇండియా ప్రతినిధి / పెద్దకడుబూరు మండలం జూలై 12 :- పెద్దకడబూరు మండల ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల అర్లప్ప మరియు పబ్లిసిటీ విభాగం తాలూకా అధ్యక్షులు జె. ముక్కరన్న లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి స్థానిక ఎమ్మిగనూరులో స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ నాయకులు బొగ్గుల ఆర్లప్ప మాట్లాడుతూ తనకు మండల ఎస్సి సెల్ అధ్యక్షునిగ పదవిని అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డికి వైసిపి జిల్లా అధికార ప్రతినిధి ఆర్. పురుషోత్తం రెడ్డికి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డికి, మంత్రాలయం తాలూకా బూత్ లెవెల్ విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డికి అలాగే నా పదవికి సహాయ సహకారాలు అందించిన ప్రతి మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ పదివి పై నమ్మకముంచి వైసీపీ పార్టీ బలోపేతానికి నా వంతు సహాయ సహకారాలు అందించి వైసీపీ పార్టీ గెలుపే దిశగా ముందుకు తీసుకెళ్తానని వైసీపీ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముక్కరన్న, ప్రసాదు,ఏసన్న,జాంబన్న, బొగ్గుల యువరాజ్,లోకయ్య, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు...
Comment List