కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి

• వృత్తి కే డాక్టర్, కబ్జా చేయడంలో మంచి నైపుణ్యం • అక్రమాలకు ‘అమ్ముడుపోయిన’ సంగారెడ్డి మున్సిపల్ ‘టి పి ఓ, కమిషనర్’!

On
కలెక్టర్ గారు 'ఒక' కన్నేయండి

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  05, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్ ప్రక్కన ఈ అక్రమ నిర్మాణం, కబ్జా కొనసాగుతున్నది. ప్రతి రోజు జిల్లా కలెక్టర్ వారి ఇంటి నుండి వారి కార్యాలయానికి వచ్చేదారిలో డాక్టర్ నేహా చౌదరి అక్రమాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం ద్వారా పొందిన అప్రూవల్ ఫైల్ నం. 009565/బీపీ/డీటీసీపీ /3055/0007/2022 కు భిన్నంగా, ప్రక్కన వున్నా స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం కొనసాగుతోంది. బిల్డింగ్ అనుమతి పొందే సమయంలో సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నేహా చౌదరి ద్వారా సమర్పించిన దస్తావేజులు ప్రకారం నిర్మాణానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. బిల్డింగ్ రూల్స్ చట్టాన్ని 'బుల్‌డోజ్ చేస్తూ' నియమ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. జి.ఓ నం.168 నియమ నిబంధనలు కాలరాస్తూ బరితెగించి యథేచ్ఛగా నిర్మాణం పనులు కొనసాగుతున్నవి. అక్రమదారు ప్రభుత్వ సంబంధిత శాఖ అధికారులకు కొనుగోలు చేసినట్టు బహిరంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి, ఈ కబ్జాకోరు నిర్మాణం పట్ల  వ్రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నప్పటికీ ఈ కబ్జాదారుకి సంబంధిత మున్సిపల్ శాఖ అధికారుల ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లదని అతివిశ్వాసంతో విర్రవీగుతున్నారని సమాచారం. ఇందులో భాగంగానే పరిస్థితులు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అవినీతికి అమ్ముడు పోయిన టిపిఒ! అడ్డుకోలేని అసమర్థ మున్సిపల్ కమిష్నర్? అన్నట్టు అక్రమాలకు సహకరిస్తు సంగారెడ్డి మున్సిపల్ సిబ్బంది అమాయకంగా నటిస్తున్నారు. నిరంతరం  జిల్లా కలెక్టర్  వచ్చి పోయే దారి కాబట్టి ఈ అక్రమ నిర్మాణం, కబ్జా అనే సమస్య పై 'ఓక కన్నేస్తే' తప్ప ఈ కబ్జాకోరల నుండి ప్రభుత్వ ఆస్తిని కాపాడలేమని అక్కడి స్థానికులు జిల్లా కలెక్టర్ పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. WhatsApp Image 2025-07-05 at 6.43.19 PM

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News