'నాలా' ను కబ్జా చేసి మింగిన 'కొండచిలువ' డాక్టర్ నేహా చౌదరి
స్వంత శాఖ పట్ల కనీస 'కృతజ్ఞత' లేని సిబ్బంది
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 06, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగ, మురళీకృష్ణ ఆలయం వెళ్లే దారిలో ఆర్చ్ ప్రక్కన ఈ అక్రమ నిర్మాణం, నాలా కబ్జా కొనసాగుతున్నది. ప్రతి రోజు జిల్లా కలెక్టర్ వారి ఇంటి నుండి వారి కార్యాలయానికి వచ్చేదారిలో ‘డాక్టర్ నేహా చౌదరి’ అక్రమాలు కొనసాగుతున్నాయి. సహజ స్థితిలో వున్నా ‘ప్రభుత్వ నాల’ ను కబ్జా చేసి కాంక్రీట్ తో స్థిర నిర్మాణం చేసిన అక్రమన్నీ ఇరిగేషన్ శాఖ సర్కిల్, సంగారెడ్డి ఎస్ఇ, ఇ ఇ , డిఇ, ఏఇ అధికారులు కనులుండి చూడని గుడ్డివారిగా వ్యవహరిస్తున్నారు. బిల్డింగ్ అనుమతి పొందటానికి ముందు సమయంలో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖల ద్వారా పొందిన అర్హత ప్రమాణ పత్రాలు ‘ఇరిగేషన్ శాఖ ‘ఎన్ఓసి’ లెటర్ నెం.ఇ ఇ / ఐడి నం.1 / ఎస్ అర్ డి / డి బి / ఏ ఇ ఇ -2 / 2025 తేదీ. 23-01-2025’ ఆధారిత దస్తావేజు తో పాటు ‘రెవెన్యూ-ఇరిగేషన్ శాఖ ల జాయింట్ సర్వే రిపోర్ట్, తేదీ. 17-11-2022’ కు భిన్నంగా, ప్రక్కన వున్నా ‘ప్రభుత్వ నాల’ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం కొనసాగుతోంది. బిల్డింగ్ అనుమతి పొందే సమయంలో సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నేహా చౌదరి ద్వారా సమర్పించిన దస్తావేజులు ప్రకారం నిర్మాణానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. బిల్డింగ్ రూల్స్ చట్టాన్ని 'బుల్‌డోజ్ చేస్తూ' నియమ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. ప్రభుత్వ నాలా ను కబ్జా చేసి, సహజ స్థితిలో అట్టి నాలా ను కాంక్రీట్ తో స్థిర నిర్మాణం చేసి, ‘రెండు మీటర్ల బఫర్ జోన్ స్థలాన్ని కబ్జా చేసి’ కట్టడాన్ని కొనసాగిస్తున్నారు. జరుగుతున్నా ఈ అక్రమాలని కాపాడటానికి ఇరిగేషన్ శాఖ ఎస్ఇ, ఇఇ, డిఇ, ఏఇ కు పూర్తిస్థాయి అధికారాలు ఉన్నప్పటికీ ‘’తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అనే చందంగా‘’.. స్వంత శాఖ పట్ల కనీస కృతజ్ఞత లేకుండా ఉద్యోగ ద్రోహులుగా వ్యవహరిస్తున్న ఈ అధికారుల తీరు చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. వెంటనే ఈ అక్రమకట్టడం ఆపివేసి, కబ్జా కు గురికాబడ్డ ప్రభుత్వ నాలాను అక్రమ దారు స్వాధీనం నుండి విడిపించి, అక్రమంగా కాంక్రీట్ తో చేసిన స్థిర నిర్మాణం నాలాను కూల్చివేసి సహజ స్థితి పొందే విధంగా చేసి, కబ్జా కు గురికాబడ్డ రెండు మీటర్ల బఫర్ జోన్ ను అక్రమ దారు డాక్టర్ నేహా చౌదరి స్వాధీనం నుండి విడిపించాలని ఫిర్యాదు దారుడు కోరుతున్నాడు.
Comment List