కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.

కూటమి అధికారంలో వైయస్ఆర్ విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులు - నేడు అదే ప్రదేశంలో వైయస్ఆర్ నూతన విగ్రహం ఆవిష్కరణ...

On
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం  - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.

ముఖ్య అతిధులుగా మంత్రాలయం వైసీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి హాజరు...

న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా / పెద్దకడుబూరు మండలం జూలై 08 :-  పెద్దకడబూరు మండల పరిధిలోని బాపుల దొడ్డి గ్రామ ప్రవేశ ద్వారం నందు ప్రధాన రహదారిలో ఉన్న మాజీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024సంవత్సరం అక్టోబర్ నెల శుక్రవారం రోజు గుర్తుతెలియని కొందరు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది... ఆనాడు విగ్రహం ధ్వంసమైన ప్రదేశానికి చేరుకున్న వైసిపి నేతలు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ప్రధాత, సంక్షేమ ప్రదాత, పేద ప్రజలతో మమేకమైన మహానేత వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడం పిరికిపందలు చేసే పని అని మండిపడటం జరిగింది. విగ్రహం ధ్వంసం అయిన ప్రదేశంలోనే మరో కొత్త వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆనాడు తెలపడం జరిగింది. అయితే మాట ప్రకారం నేడు 2025సం; జులై నెల మంగళవారం రోజు వైయస్ఆర్ 76వ జయంతి సందర్బంగా బాపులదొడ్డిలో విగ్రహం ధ్వంసమైన ప్రదేశంలోనే మరో నూతన విగ్రహం ఏర్పాటు చేసి ఆవిష్కరించారు...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రాలయం వైసీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే వైబాలనాగి రెడ్డి హాజరయ్యి, వైసీపీ మండల నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రా రెడ్డి, నవీన్ రెడ్డి, విజేంద్ర రెడ్డి, శివరామి రెడ్డి మరియు కార్యకర్తల నడుమ నూతన విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మన రాష్ట్రంలో ఎంతోమంది పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రాష్ట్ర ప్రజల జీవితాలలో చిరస్థాయిగా గుండెల్లో నిలిచిన మహానేత వై యస్ ఆర్ అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు వైఎస్ఆర్ అని, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విగ్రహన్నీ ధ్వంసం చేసిన దుండగులకు ఏవైనా కక్షలు ఉంటే, మాతో నేరుగా చూసుకోవాలి గాని పిరికి వాళ్ళమాదిరిగా ఇలాంటివి చేయడం సరికాదన్నారు. వైసిపి అంటే వెంటనే గిట్టని వ్యక్తులే వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఇది కూటమి ప్రభుత్వం అధికారంలో జరగడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు... ఒక సంతకం ఆటోగ్రాఫ్‌ గా మారిందంటే అది వైయస్సార్ వలనేనని, వైయస్సార్ భౌతికంగా మనకు దూరమైన ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నారన్నారు. దివంగత నేత వైయస్. రాజశేఖర్ రెడ్డి మరణం లేని మహానేత అని, రాజశేఖర్ రెడ్డి పుట్టింది ఆయన కుటుంబం కోసం కాదు, పేద బడుగు బలహీనవర్గాల ప్రజల కోసమేనన్నారు. 2029 సంవత్సరంలో వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వైఎస్సార్ పాలన సాధ్యమవుతుందన్నారు... పేద ప్రజలకు అండగా తండ్రి బాటలో జగనన్న ఎప్పటికి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే తపించే వ్యక్తి అని, ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి చేస్తూనే మరియు మరో వైపు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ పాలన కొనసాగిస్తారన్నారు... కార్యక్రమంలో సర్పంచ్ చిన్న మహాదేవ, పెద్ద మహాదేవ, మాజీ సర్పంచ్ లింగన్న, మాజీ డీలర్ మహాదేవ, వైసీపీ నాయకులు ముక్కరన్న, అర్లప్ప, రాజు, శాంతిమూర్తి, ఈరన్న, దస్తగిరి, ముని, జాము మూకయ్య,పీకలబెట్టా మూకిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు...InShot_20250708_180225741

Views: 48
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News