ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధిపరచుకోవడం అవసరం..

On
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..

విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధిపరచుకోవడం అవసరం..

Screenshot_2025-06-29-18-11-47-43_6012fa4d4ddec268fc5c7112cbb265e7
ప్రారంభించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

ఇబ్రహీంపట్నం, జూన్ 29, న్యూస్ ఇండియా ప్రతినిధి:

నేటి ఆధునిక యుగంలో కేవలం బ్యాంకు లపై పరిమితం కాకుండా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధిపరచుకోవడం అవసరమని ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగులూరు సమీపంలో అత్యధిక మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తుర్లపాటి శిరీష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కేవలం బ్యాంకులపై పరిమితం కాకుండా విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధిపరచుకోవడం అవసరం, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సమాజంపై బలమైన అవగాహనతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ తరహా విశిష్ట విద్యాసంస్థలు మన ప్రాంతానికే కాదు సమాజానికే మేలు కలిగించే విధంగా ఉండాలని అన్నారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మాట్లాడుతూ... పిల్లల ఎదుగుదల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందించాలన్న సంకల్పంతో ఈ స్కూలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర ప్రతిష్టాత్మక సర్వీస్ లో ప్రవేశించి తమ ప్రతిభను చాటాలని కోరుకుంటున్నామని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ మాట్లాడుతూ.. ఈ స్కూల్ విద్యారంగంలో ఓ రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. బలమైన పాఠ్య ప్రణాళిక ఉత్తమ ఉపాధ్యాయ బృందంతో విద్యార్థులు దేశ సర్వీసులోకి చేరే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఇస్రో మాజీ మిషన్ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పీకె సుందర మూర్తి, ప్రఖ్యాత సాంస్కృతిక నవల రచయిత, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్కూల్ డైరెక్టర్ రాహుల్ అప్పని, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కరాచారి పలువురు ప్రజా ప్రతినిధులు పాఠశాల చైర్మన్ శిరీష్ తూర్లపాటి, కోపౌండర్ రాధిక తుర్లపాటి, డైరెక్టర్ ఆపరేషన్ రాహుల్ పాణి, బొంగులూరు బ్రాంచ్ ఇంచార్జ్ శ్రీనివాస్ పోలా, నవ్య పోలా హనీస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 75

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!