పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ప్రత్యేక డిమాండ్...
పలు సమస్యలపై పత్రిక ప్రకటనలో మాట్లాడుతున్న సిపిఐ మండల కార్యదర్శి వీరేష్...
న్యూస్ ఇండియా ప్రతినిధి / పెద్దకడుబూరు మండలం జూలై 01 :- పెద్దకడబూరు మండల పరిధిలో ఆయా గ్రామాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మండిపడ్డారు. మంగళవారం సిపిఐ పార్టీ కార్యాలయలో నిర్వహించిన పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మండలలోని చాలా గ్రామాలలో డ్రైనేజీలు నిండిపోయి త్రాగునిటీ సమస్య మరియు వీధి లైట్లు సమస్యలు ఉన్న వారు పట్టించుకోవడం లేదని అన్నారు. పేద ప్రజలేమో తన సమస్య చెప్పడానికి ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా పరిష్కరించే నాధుడే లేన్నారు. పంచాయతీ కార్యదర్శులకు సమస్య చెప్పిన కూడా ఇదిగో అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాము అంటూ రేపు చేపిస్తాం, ఎల్లుండి చేపిస్తామంటూ కాలయాపన చేయడం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై ఎంపీడీవో స్పందించి మండలంలోని వివిధ గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని పంచాయతీ కార్యదర్శిలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ గా డిమాండ్ చేసారు. లేనియెడల పెద్ద ఎత్తున ఎంపీడీవో ఆఫీస్ ముట్టడిస్తామని ఆయన అన్నారు...
Comment List