ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం

56వ డివిజన్లో దూసుకుపోతున్న హస్తం

On
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సత్యభామ ప్రచారం

తనదైన శైలిలో సుందర్ రాజ్ కార్యకర్తల సమీకరణ 

కొత్తగూడెం (న్యూస్ఇండియా బ్యూరో) ఫిబ్రవరి 4: నూతనంగా ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్  56వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేట్ ఎన్నికల ప్రచారంలో, ప్రజల సమస్యలను నేరుగా ఎజెండాగా చేసుకుని బాలశెట్టి సత్యభామ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గల్లీగల్లీ తిరుగుతూ, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ, వారి సమస్యలను వింటూ ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నారు.డివిజన్‌లో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారుల దుస్థితి వంటి సమస్యలు ఎన్నాళ్లుగానో ప్రజలను వేధిస్తున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని సత్యభామ తెలిపారు. హామీలతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు తనవికావని, పనిచేసే పాలననే అందిస్తానని ప్రచారంలో స్పష్టం చేశారు.“ప్రజలే నా బలం. వారి నమ్మకమే నాకు శక్తి. సమస్య చెప్పగానే స్పందించే కార్పొరేట్‌గా ఉండాలన్నదే నా ఆశయం” అని సత్యభామ పేర్కొన్నారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కారంలో తాను చురుకుగా పాల్గొన్న అనుభవాన్ని గుర్తు చేస్తూ, అదే సేవాభావంతో ముందుకు సాగుతానన్నారు.మహిళల భద్రత, వృద్ధులకు సంక్షేమ పథకాల సక్రమ అమలు, యువతకు ఉపాధి అవకాశాలు, పిల్లలకు మెరుగైన విద్యా-క్రీడా వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె తెలిపారు. ప్రజల సూచనలను నేరుగా స్వీకరించి, వాటిని తన కార్యాచరణలో భాగం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ప్రచారంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటుండడం విశేషంగా కనిపిస్తోంది. స్థానికులు మాట్లాడుతూ, “సత్యభామ ఎప్పుడూ మా మధ్యే ఉంటారు. సమస్య అడిగితే స్పందించే నాయకురాలు” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.56వ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా, సేవే లక్ష్యంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న ఈ ప్రచారం ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తోంది. ప్రజల నమ్మకమే తన గెలుపు పునాదిగా సత్యభామ ప్రచారం సాగుతోంది.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..