ముఖ్య అతిధి గా ‘టీజీఐఐసీ చైర్ పర్సన్’
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్ సాహితీ రాము తన జన్మదినాన్ని వినూత్నంగా రక్తదాన శిబిరంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్ ఆవరణలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అవసరమైన రక్తాన్ని సమకూర్చడమే కాక, యువతలో సేవా స్పూర్తిని పెంపొందిస్తాయి అన్నారు. సాహితీ రాము తన జన్మదినాన్ని ఇలాంటి వినూత్నంగా మలచడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 75 మంది స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. వారిలో యువత, మహిళలు, సామాన్యులు పెద్దఎత్తున ముందుకొచ్చారు. రక్తదానం చేసిన ప్రతి దాతకు పండ్లు, ఉపహారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సాహితీ రాము మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల అనేకమంది ప్రాణాలు కాపాడబడతాయి అన్నారు. ఇదే నిజమైన పుట్టినరోజు ఉత్సవం అంటూ ‘సేవకే ప్రాధాన్యం’ అని భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, స్నేహితులు, స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొని భాగస్వామ్యం చేశారు. హాస్పిటల్ ప్రాంగణం సందడిగా మారింది. రక్తదాతల సహకారంతో ఏర్పాట్లు ప్రొఫెషనల్ స్థాయిలో జరిగాయి. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురు స్వాములు భక్తులు ఆయన మిత్రులు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List