ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి : ఎస్పీ రోహిత్ రాజు 

On
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండే విధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు.ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Views: 21
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం