'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?

On
'అర్హులైన జర్నలిస్టులకు' అన్యాయం?

• 2011 సం. తెలంగాణ ఏర్పడినట్లు అధికారిక పత్రాలు. • ఫోర్జరీ సంతకాల పాత్రదారులెవరు? • దొంగతనంగా రాజముద్రలు తయారీ! • సాటి పాత్రికేయుల హక్కుల దోపిడీ దొంగలు ఎవరు? • పెద్ద పత్రికలలో పని చేస్తే.. మోసాలకు మినహాయింపా ?

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై  08, న్యూస్ ఇండియా : పూర్తి అర్హత ప్రమాణాలు కల్గిన స్థానిక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిలో మునిగి తేలిన కొంత మంది అధికారుల చేతివాటాన్ని మేము బలి అయ్యామని స్థానిక జర్నలిస్టులకు దుఃఖం వెలిబుచ్చారు. అర్హత ఉన్నవారికి కాకుండా, నకిలీ ప్రమాణాలతో వ్యవస్థను మోసగించి గృహ స్థలాలు కేటాయించిన దారుణం సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా నిజాయితీగా మీడియా వృత్తిలో సేవలందిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందలేక పోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్నప్పటికీ, వారిని గౌరవించకుండా వ్యవస్థవే వారి హక్కులను హరిస్తోందని మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, అబద్ద నివేదికలు: కంది గ్రామంలో సర్వే నంబరు 616 భూమిని మీడియా భవనాల కోసం కేటాయించినట్టు పేరుతో, అర్హతలేని వ్యక్తులు భూములను పొందినట్లు సమాచారం. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 599 లో కూడా మాదిరిగానే తప్పుడు డాక్యుమెంట్లతో ప్లాట్లు పొందినట్టు తెలిసింది. కొందరు స్థానికులే కాకుండా ఇతర జిల్లాల జర్నలిస్టులకూ నిబంధనలు పట్టించుకోకుండా స్థలాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కుట్ర కోణాల పై అనుమానాలు: WhatsApp Image 2025-07-08 at 6.08.33 PMసంగారెడ్డి ఆర్డీవో, కంది ఎంపీడీఓ, ఎమ్మార్వోలు కూడా పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2011 లోనే తెలంగాణ ఏర్పడినట్టు, కంది మండలం అప్పటినుంచే ఉందని తప్పుడు నివేదికలు తయారుచేసి, వాటిపై అధికార ముద్రలు వేశారని వర్కింగ్ జర్నలిస్టులు తెలిపారు. కొందరిని సంతృప్తి పరిచేందుకు, లేదా లంచాల లాబీలకై, జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించారని వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందే జర్నలిస్టులుగా పనిచేశారంటూ నకిలీ గుర్తింపు పత్రాల ఆధారంగా ప్లాట్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ దృష్టికి ఈ వివాదంపై స్పందించిన వర్కింగ్ జర్నలిస్టులు ఇటీవల సంగారెడ్డి కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అక్రమంగా కేటాయించిన స్థలాలపై విచారణ జరిపి, వాటిని రద్దు చేసి, నిజమైన అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాటి పాత్రికేయుల హక్కులు హరించి, దోపిడీ దొంగలలాగా రెండొవ సారి, మూడొవసారి ప్రభుత్వాల ద్వారా లబ్ది పడితే మా ఉసురు ముట్టి సర్వ నాశనమై పోతారని కొందరు పాత్రికేయులు బాధను వ్యక్తం చేశారు. అవసరమైతే దీని కోసం వారు ఆందోళనలకైనా సిద్ధమేనని హెచ్చరిస్తున్నారు.

Views: 43
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News