రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

On
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..

మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం..

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

IMG-20250630-WA0928
బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను నాటుతున్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి..

రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, జూన్ 30, న్యూస్ ఇండియా ప్రతినిధి: రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం, మార్కెట్లో దళారి వ్యవస్థకు అవకాశం ఇవ్వమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు.  అనంతరం మార్కెట్ కి సంబంధించిన కార్యక్రమాలను త్వరలో చేపట్టబోయే కోయడం మార్కెట్ కి సంబంధించిన ప్రాజెక్టు పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే మా ఉద్దేశమని మార్కెట్ కి వచ్చే ప్రతి రైతు న్యాయం చేసేలా పాలకవర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు. అధిక కమిషన్లు వసూలు చేసే మార్కెట్ వ్యాపారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం బాటసింగారం లాజిస్టిక్ పార్క్ లో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తే కొంత మంది భూములు, చెట్లు అధిక రేట్లకు మార్కెట్ కి ఇచ్చారని, వాటిని తగ్గించాలి లేనిపక్షంలో మార్కెట్ పాలకవర్గం వాటి స్థానంలో కొత్త సీట్లు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ మార్కెట్ ముందు కొంతమంది దళారుల వ్యాపారం చేస్తూ మార్కెట్ ఆదాయంతో గండి కొడుతున్నారని రైతులకు మార్కెట్లో అవకాశం ఇస్తామని అన్నారు. దళారులకు మార్కెట్లో చోటు లేదని, పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడలు ఏర్పాటు చేయబోయే అధినేత మార్కెట్ కి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దేశంలోనే మంత్రి సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే పక్కన ఉన్న ప్రభుత్వ భూములను మార్కెట్ కి అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి మమ్మద్ రియాజ్, డి రవీందర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర చారి, డైరెక్టర్లు దోమలపల్లి అంజయ్య, పన్యాల జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, మెకం లక్ష్మి, మచ్చేందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, గోవర్ధన్ రెడ్డి, నటరాజ్, నరసింహ, వెంకట్ గుప్తా, ఇబ్రహీం, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం..

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్