వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :- వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం వైయస్సార్సీపి యువజన విభాగ కమిటీ అభ్యర్థుల ఎంపిక జరిగింది... ఇందులో వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం కమిటీ సెక్రటరీ పెద్దకడుబూరు మండలం & గ్రామానికి చెందిన ఆర్. శివరామి రెడ్డి నియమితులయ్యారు.... అనంతరం ఆయన మాట్లాడుతూ నన్ను నమ్మి ఇంతగొప్ప అవకాశాన్ని కల్పించిన మంత్రాలయం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వైబాలనాగిరెడ్డి అన్నగారికి , వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వై.ప్రదీప్ రెడ్డి అన్నగారికి , పెద్దకడుబూరు వైయస్ఆర్సిపి మండల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామ్మోహన్ రెడ్డి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు... అలాగే తనకి ఇచ్చిన పదవి భాద్యత పై వైసీపీ నేతల నమ్మకాలను వమ్ము చేయకుండా యువజన విభాగం జిల్లా సెక్రటరీ గా తన వంతు భాద్యతను సక్రమంగా నెరవేరుస్తూ, అలాగే వైసీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తూ పోరాడుతానని హామీ హామీ ఇవ్వడం జరిగింది...... పెద్దకడుబూరు మండలం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు మరియు మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు...
Comment List